Corona Cases : భారత్‌లో కరోనా సునామీ.. ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్ కేసులు

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ థ‌ర్డ్‌వేవ్ టెన్షన్ మొద‌లైంది. గంట గంటకూ కేసులు పెరుగుతున్నాయి. ఉప్పెన లాగా కరోనా విలయతాండవం చేస్తోంది. 8 రోజుల్లోనే ఇండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

Corona Cases : భారత్‌లో కరోనా సునామీ.. ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్ కేసులు

Covid (2)

corona cases in India : కరోనా సునామీ భారత్‌పై విరుచుకుపడింది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. నిన్న ఒక్కరోజే భారత్‌లో లక్షా 17 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 214 రోజుల తర్వాత భారత్‌లో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గతేడాది జూన్ తర్వాత ఒక్కరోజే లక్ష కేసులు రికార్డవడం ఇదే తొలిసారి. 8 రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షకు చేరింది. సెకండ్‌వేవ్‌లో 10 వేల నుంచి లక్ష రోజువారీ కేసులకు 47 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు కేవలం 8 రోజుల్లోనే కేసుల సంఖ్య ఇంతలా పెరిగిందంటే దేశంపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉందో క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. సెకండ్‌వేవ్‌ కంటే 5 రెట్ల ఎక్కవ వేగంతో కేసుల రికార్డవతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక దేశ‌వ్యాప్తంగా కోవిడ్ థ‌ర్డ్‌వేవ్ టెన్షన్ మొద‌లైంది. గంట గంటకూ కేసులు పెరుగుతున్నాయి. ఉప్పెన లాగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ 8 రోజుల్లోనే ఇండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. డసెంబర్‌ 28న రోజువారీ కేసుల సంఖ్య 10వేలుగా రికార్డయింది. రెండు రోజుల క్రితం 50 వేల కేసులు రిపోర్ట్‌ అయితే..మొన్న 90 వేల కేసులు.. నిన్న ఏకంగా లక్షా 17 వేల కేసులు..! ఇలా జెట్ స్పీడ్‌తో కరోనా వీరవీహారం చేస్తోంది.

Pregnant Woman Suicide : మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనని.. కాన్పుకు ముందురోజే గర్భిణీ ఆత్మహత్య

ఇక జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి వరకూ కరోనా విలయమే అంటున్నాయి సర్వేలు. రానున్న రెండు వారాలు కీలకం అంటున్నారు నిపుణులు.. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు. అటు కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు కూడా అదే చెబుతున్నారు. ఒకరోజుకు దాని తర్వాతి రోజుకి కేసుల సంఖ్యలో పొంతనే ఉండదన్న వారి పరిశోధన అక్షరాల నిజమవుతోంది.

ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌లో గుర్తించిన కేసులు సంఖ్య 3 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 377 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అటు ప్రస్తుతం దేశంలో 3లక్షల 50 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 67శాతం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, తమిళనాడు, కేరళలోనే ఉన్నాయి. కరోనా మరోసారి విజృంభిస్తుండంతో ప్రధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలు, ఒమిక్రాన్‌ వ్యాప్తిపై చర్చించనున్నారు.