Omicron Variant: ఒమిక్రాన్ ప్రాణాంతకమే…లైట్ తీసుకోవద్దు – WHO

ఈ వైరస్ కూడా ప్రాణాంతకమేనని హెచ్చరిస్తోంది.ఒమిక్రాన్ బారిన పడ్డవారు సైతం ఆస్పత్రుల్లో చేరుతున్నారని, ఇది తేలికపాటి రకంగా కొట్టిపడేయడానికి వీల్లేదని వెల్లడించింది. అంతేగాకుండా..

Omicron Variant: ఒమిక్రాన్ ప్రాణాంతకమే…లైట్ తీసుకోవద్దు – WHO

Who

Omicron Variant : ఒమిక్రాన్ ప్రాణాంతకమా ? కాదా ? అనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చింది. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వైరస్ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో…డబ్ల్యూహెచ్ఓ (WHO) స్పందించింది. ఈ వైరస్ కూడా ప్రాణాంతకమేనని హెచ్చరిస్తోంది.ఒమిక్రాన్ బారిన పడ్డవారు సైతం ఆస్పత్రుల్లో చేరుతున్నారని, ఇది తేలికపాటి రకంగా కొట్టిపడేయడానికి వీల్లేదని వెల్లడించింది. అంతేగాకుండా…ఇదే చివరి వేరియంట్ అని చెప్పలేమని బాంబు పేల్చింది. వారం వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 71 శాతం కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. నిత్యం లక్షల్లో కేసులు..! చూస్తుండగానే వందలు, వేలు దాటి లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ దెబ్బకు ప్రపంచదేశాల్లో కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. కలలో కూడా అనుకోని కేసులతో కరోనా అగ్రరాజ్యలకు షాక్‌ ఇస్తోంది. యూరోప్‌లో కరోనా కేసుల కల్లోలం మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతోంది. నిత్యం రెండు లక్షలు, మూడు లక్షలు కేసులతో ఒమిక్రాన్‌ పంజా విరుసుతోంది.

Read More : Adventure Bikes: బడ్జెట్ లో టాప్ అడ్వెంచర్ టూరింగ్ బైక్స్

మరోవైపు…కరోనా సునామీ భారత్‌పై విరుచుకుపడింది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. నిన్న ఒక్కరోజే భారత్‌లో లక్షా 17 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 214 రోజుల తర్వాత భారత్‌లో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గతేడాది జూన్ తర్వాత ఒక్కరోజే లక్ష కేసులు రికార్డవడం ఇదే తొలిసారి. 8 రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షకు చేరింది. సెకండ్‌వేవ్‌లో 10 వేల నుంచి లక్ష రోజువారీ కేసులకు 47 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు కేవలం 8 రోజుల్లోనే కేసుల సంఖ్య ఇంతలా పెరిగిందంటే దేశంపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉందో క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. సెకండ్‌వేవ్‌ కంటే 5 రెట్ల ఎక్కువ వేగంతో కేసుల రికార్డవతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌లో గుర్తించిన కేసులు సంఖ్య 3 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే 377 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అటు ప్రస్తుతం దేశంలో 3లక్షల 50 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో 67శాతం మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, తమిళనాడు, కేరళలోనే ఉన్నాయి. కరోనా మరోసారి విజృంభిస్తుండంతో ప్రధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలు, ఒమిక్రాన్‌ వ్యాప్తిపై చర్చించనున్నారు.