Mumbai : క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..జనాలు ఎవరూ గుమికూడొద్దు

ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Christmas & New Year : కొద్ది రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఫుల్ గా గ్రాండ్..గా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే కొంతమంది ప్లాన్స్ వేసుకుంటున్నారు. పార్టీలు, ఫుల్ జోష్ లో చేసుకోవాలని భావిస్తున్న..వారికి చేదు వార్త. వేడుకలపై ఆంక్షలు విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Read More : Radhe Shyam New Song : చ‌లో..చ‌లో సంచారి అంటూ.. రాధేశ్యామ్ నుండి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

జనాలు ఎవరూ గుమి కూడవద్దని హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్ ను అడ్డుకొనేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్ లో 17, ఢిల్లీలో 10, కేరళలో 5, గుజరాత్ లో నాలుగు, కర్నాటకలో మూడు, తెలంగాణలో రెండు, బెంగాల్, చండీఘడ్, తమిళనాడులో ఒక్కో కేసు నమోదైంది. మరోవైపు…భారతదేశ వ్యాప్తంగా 77 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనే అత్యధికంగా…32 కేసులు బయటపడడం కలకలం రేపుతోంది. వారిలో కోలుకున్న 25 మందికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి అయ్యారు.

Read More : Farmer Protest: రైతుల్ని చంపిన ఆ మంత్రి రాజీనామా చెయ్యాలి – రాహుల్ గాంధీ

తాజాగా బయటపడిన నాలుగు కేసుల్లో ఇద్దరు ఉస్మానాబాద్‌కు చెందిన వారు కాగా.. ఒకరు ముంబై, మరొకరు బుల్దానాకు చెందినవారిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 73కి చేరింది. ఇటు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు పౌర విమానయానశాఖ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే వారంతా తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కోసం ముందస్తు బుకింగ్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు