Radhe Shyam New Song : చ‌లో..చ‌లో సంచారి అంటూ.. రాధేశ్యామ్ నుండి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రం నుంచి ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో అనే సాగే ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

Radhe Shyam New Song : చ‌లో..చ‌లో సంచారి అంటూ.. రాధేశ్యామ్ నుండి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

Radhe Shyam New Song

Updated On : December 16, 2021 / 1:10 PM IST

Radhe Shyam New Song : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన చిత్రం రాధేశ్యామ్‌. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. చిత్రబృందం ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది..జనవరి 14న సంక్రాంతి బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు.. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్ తోపాటు రెండు పాటలు కూడా వచ్చాయి. ఇక ఈ రోజు (గురువారం) మూడో పాటను విడుదల చేసింది చిత్ర బృందం

చదవండి : Radhe Shyam: ట్రైలర్‌పై మేకర్స్ క్రేజీ థాట్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే పాట‌కు సంబంధించి వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భాస్ లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. విజువ‌ల్స్ చాలా గ్రాండియ‌ర్‌గా ఉన్నాయి. ఈ పాట విడుదలైన గంటలోనే యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయింది. ఈ పాటను అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించగా.. జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తాజాగా విడుదలైన సాంగ్ అభిమానులను అలరిస్తుంది.

చదవండి : Radhe Shyam – Sanchari : రేపే ‘రాధే శ్యామ్’లోని మూడో పాట టీజర్ రిలీజ్