రానున్న పండుగ సీజన్‌లో ఉగ్రదాడుల ముప్పు.. ఆ నగరంలో హై అలర్ట్

రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు, ప్రార్థనా మందిరాలు ఉండే చోట మాక్ డ్రిల్స్..

Mumbai on high alert: రానున్న పండుగ సీజన్‌లో ముంబై నగరంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఏజెన్సీలు సమాచారం అందించడంతో ఆ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. మతపరమైన ప్రదేశాలతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ముంబైలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని పోలీసులకు అధికారులు చెప్పారు.

‘రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు, ప్రార్థనా మందిరాలు ఉండే చోట మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఉన్నతాధికారులు మాకు చెప్పారు. డీసీపీలు అందరూ తమ తమ జోన్లలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు” అని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఇప్పటికే జనాల రద్దీ ఎక్కువగా ఉండే క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతం, ఇతర రెండు మతపరమైన ప్రదేశాల్లో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఓ అధికారి చెప్పారు. ముంబైలోని అన్ని మందిరాల్లో నిఘా పెంచారు.

అనుమానాస్పదంగా ఏదైనా కనపడితే దానిపై పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. కాగా, మహారాష్ట్రలో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అలాగే, వరుసగా పండుగలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కన్ను ముంబై నగరంపై పడింది.

Hassan nasrallah: హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా హ‌తం.. ధృవీక‌రించిన ఇజ్రాయెల్