Mumbai Police: గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లాలన్న కుర్రాడు.. పోలీసులు ఏమన్నారంటే..

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో ప్రజలు కరోనా బారిన పడడంతో ప్రభుత్వాలు ఎక్కడిక్కకడ కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి వస్తుంది. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా మారడంతో ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ విధించారు. అయితే.. అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక స్టిక్కర్లను ప్రవేశపెట్టారు.

Mumbai Police

Mumbai Police: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో ప్రజలు కరోనా బారిన పడడంతో ప్రభుత్వాలు ఎక్కడిక్కకడ కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి వస్తుంది. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రంగా మారడంతో ఇప్పటికే అక్కడ లాక్ డౌన్ విధించారు. అయితే.. అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక స్టిక్కర్లను ప్రవేశపెట్టారు. అత్యవసర సేవలు.. వైద్య సిబ్బంది.. మీడియా.. పారిశుధ్యం వంటి రంగాల వాహనాలకు ప్రత్యేక కలర్ కలిగిన స్టిక్కర్లను ప్రవేశపెట్టారు. తప్పనిసరిగా ప్రయాణించాలనుకొనేవారితో సహా అత్యవసర విభాగాల వాహనాలు ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ స్టిక్కర్లను నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని అక్కడి పోలీసులు ప్రకటించారు.

ఈ స్టిక్కర్లు వాహనాలు వెళ్లే టోల్ ప్లాజాలు, చెక్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉండగా వాహనదారులు సంబంధిత పత్రాలు చూపించి స్టిక్కర్లను పొందవచ్చు. వాహనదారులు వీటిని తమ ఇళ్లలో కూడా తయారు చేసుకోవచ్చు. వీటి వలన వాహనదారులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ముందుకు సాగిపోవచ్చు. అలానే వీటిని దుర్వినియోగం చేస్తే మాత్రం కఠిన శిక్షలు విధించాల్సి వస్తుందని పోలీసులు ముందే హెచ్చరించారు. ఈ స్టిక్కర్ల వినియోగం మీద పోలీసులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ముంబైకి చెందిన ఓ కుర్రాడు పోలీసులకు ఓ తుంటరి ప్రశ్న వేశాడు.

నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వెళదామనుకుంటున్నా.. మరి నా వెహికిల్‌కు ఏ స్టిక్కర్ వాడాలి. ఆమెను చాలా మిస్సవుతున్నా అంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనికి ముంబై పోలీసులు ఏ మాత్రం సీరియస్ కాకుండా హుందాగా సమాధానం చెప్పారు. గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడం మీకు ఎంతో ముఖ్యమని మేం అర్థం చేసుకున్నాం. కానీ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇది అత్యవసరమేమీ కాదు కనుక మీకు స్టిక్కర్ ఇవ్వలేం. దూరం పెరిగేగొద్దీ మనసులు మరింత దగ్గరవుతాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఆరోగ్యకరం కూడా అని సమాధానం ఇచ్చారు.

అంతేకాదు మీరిద్దరూ జీవితాంతం కలిసుండాలని మేం కోరుకుంటున్నాం. కనుక ఇప్పుడు మీరు కలవకపోవడమే మంచిది. గుర్తుంచుకోండి.. ఇది జీవితంలో ఓ దశ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. పోలీసుల ట్వీట్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వేల కొద్దీ లైకులు, రీట్వీట్‌లూ వచ్చిపడుతున్నాయి. ప్రశ్న అడిగిన కుర్రాడిని తెగ తిడుతున్న నెటిజన్స్.. పోలీసుల సమాధానానికి ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి తుంటరి కుర్రాళ్ళకి అంతే తెలివిగా.. హుందాగా సమాధానం ఇచ్చిన ముంబై పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

Read: Mahaboob Nagar Old Man: తాత పిట్టగూడు మాస్క్.. అధికారులు షాక్!