ముంబైలో రాత్రి 11తర్వాత న్యూఇయర్ పార్టీలకి అనుమతి

ముంబైలో రాత్రి 11తర్వాత న్యూఇయర్ పార్టీలకి అనుమతి

Mumbaikars can party after 11 pm ముంబై వాసులు డిసెంబర్-31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతి లభించింది. కొత్త సంవత్సరంలోకి మరికన్ని గంటల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-31,2020)రాత్రి 11గంటల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకునేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC)అనుమతిచ్చింది.

కరోనా నేపథ్యంలో రాత్రి 11గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుందని..జనవరి-5వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని బీఎంసీ కమిషనర్ I.S. చాహల్ తెలిపారు. ఈ సందర్భంగా బీఎంసీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇవాళ రాత్రి 11గంటల తర్వాత కూడా ముంబై వాసులకు ఫుడ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు బీఎంసీ అనుమతిచ్చింది. అయితే,ఇప్పటివరకు అన్ని హోం డెలివరీలు 11గంటలకల్లా తప్పనిసరిగా ఆపేయాలన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఈ నిబంధనను తాత్కాలికంగా పక్కనబెట్టింది బీఎంసీ.

అయితే,కోవిడ్ నివారణ నిబంధనలు ఫాలో అవ్వాలని బీఎంసీ సూచించింది. కాగా,ముంబైలో ఇవాళ రాత్రి 11గంటల తర్వాత ఏ హోటల్ లో,బార్ లో,పబ్ లలో,రెస్టారెంట్లలో పార్టీలకు అనుమతి లేదని బీఎంసీ సృష్టం చేసింది. సూచించిన సమయం దాటిన తర్వాత ఎటువంటి బోటు పార్టీ లేదా టెర్రస్ పార్టీలు అనుమతించబడవని తెలిపింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోబబతాయని సృష్టం చేసింది.

మరోవైపు,ముంబై పోలీసులు “హై అలర్ట్” గా ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో దేశ ఆర్థికరాజధానిలో ఎలాంటి అల్లర్లు, ఉగ్ర దాడులు జరగకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముంబై వీధుల్లో దాదాపు 35వేల మంది పోలీసులు మొహరించబడ్డారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.