Gyanvapi Issue: జ్ఞానవాపిని మసీదు అంటే గొడవలు జరుగుతాయట.. సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
1991లో విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అక్కడ మసీదు నిర్మించబడిందని, అదే నేటి జ్ఞాన్వాపి మసీదని కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన భక్తులు ఒక దావా వేశారు

Yogi Adityana: జ్ఞానవాపి మసీదు అంశం(Gyanvapi Issue)పై ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపిని మసీదు గొడవలు జరుగుతాయంటూ ఆయన ఒక రకంగా హెచ్చరించిన విధంగానే చెప్పారు. ఈ విషయమై ఓ ప్రశ్నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఎందుకుంది? దేవతలు, జ్యోతిర్లింగాలు ఎందుకున్నాయంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘మసీదు లోపల త్రిశూల్ ఎందుకుంది? హిందువులెవరూ దానిని అక్కడ ఉంచుకోలేదు. జ్యోతిర్లింగాలు ఉన్నాయి, దేవతల ప్రతిమాలు ఉన్నాయి. జ్ఞానవాపిలో గోడలు ఏడుస్తున్నాయి, ఎదో చెప్తున్నాయి. చారిత్రక తప్పిదంపై ముస్లిం సమాజానికి ఏదో సంకేతాలు ఇస్తున్నాయి. మనం వాటిని సవరించాల్సిన అవసరం ఉంది’’ అని యోగి అన్నారు.
1991లో విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసిన అనంతరం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అక్కడ మసీదు నిర్మించబడిందని, అదే నేటి జ్ఞాన్వాపి మసీదని కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిన భక్తులు ఒక దావా వేశారు. ఈ విషయమై మసీదును నిర్వహించే అంజుమన్ ఇస్లామియా మసీదు కమిటీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. పూజా స్థలాల చట్టం 1991ని ఉటంకిస్తూ కేసు సామర్థ్యాన్ని కమిటీ ప్రశ్నించింది. ఆ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావాన్ని మార్చకూడదు. అదే విషయాన్ని అంజుమన్ ఇస్లామియా మసీదు కమిటీ సవాలు చేసింది.
1991 నాటి ఆరాధనా స్థలాల చట్టం వలె, ఈ కేసు కూడా 1991 సంవత్సరంలో దాని మూలాలను కలిగి ఉంది. ఈ విషయంలో మొదటి పిటిషన్‌ను 1991లో వారణాసి కోర్టులో విశ్వేశ్వరుడు దాఖలు చేశారు. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసుకునే హక్కు కల్పించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ తన పిటిషన్‌లో మూడు డిమాండ్లను ఉంచారు. మొత్తం జ్ఞాన్వాపి సముదాయాన్ని కాశీ ఆలయంలో భాగంగా ప్రకటించడం, సముదాయ ప్రాంతం నుంచి ముస్లింలను తరిమివేయడం, మసీదు కూల్చివేత వంటివి ఇందులో ఉన్నాయి.