Mutton Or Husband : మటన్‌ కావాలా? మొగుడు కావాలా? భార్యను తేల్చుకోమన్న భర్త

మటన్.. ఎంత పని చేసింది.. ఓ పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. భార్య, భర్త మధ్య కీచులాటకు కారణమైంది. ఏకంగా ఆ జంట విడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం

Mutton Or Husband : మటన్‌ కావాలా? మొగుడు కావాలా? భార్యను తేల్చుకోమన్న భర్త

Mutton Or Husband

Updated On : December 3, 2021 / 8:09 PM IST

Mutton Or Husband : మటన్.. ఎంత పని చేసింది.. ఓ పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. భార్య, భర్త మధ్య కీచులాటకు కారణమైంది. ఏకంగా ఆ జంట విడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అవును మటన్ వల్లే ఆ ఇద్దరికీ చెడింది. ఇంతకీ ఆ దంపతుల మధ్య గొడవకు మటన్ కర్రీ ఏ విధంగా కారణమైందో తెలుసా..

ఢిల్లీకి చెందిన వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. అందమైన భార్య దొరకడంతో అతడు ఆనందంతో గాల్లో తేలాడు. కొన్ని రోజులు వారి సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాత కాపురంలో కలతలు రేగాయి. దానికి కారణం భార్య వేరొకరి ప్రేమలో పడడమే.. అయితే ఆమె ప్రేమలో పడిందో వ్యక్తితో కాదు.. మటన్ కర్రీతో.

Tanzanian Siblings : బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ను లిప్ సింక్‌తో ఊపేశారు.. ఎవరీ టాంజానియా అన్నాచెల్లెళ్లు..!

భర్త శిరీష్ ఫ్యామిలీ ప్యూర్ వెజిటేరియన్ (శాఖాహారి). ఆమె భార్య ఫ్యామిలీ కూడా వెజిటేరియన్సే. కానీ, ఆ మహిళ చదువుకునే రోజుల్లో ఓసారి మటన్ రుచి చూసిందట. అంతే, దానికి ఫిదా అయిపోయింది. ఇంట్లో తెలియకుండా బయట మటన్ లాగించేది. పెళ్లి చూపుల్లో ఆమె ఈ విషయాన్ని అతడితో చెప్పింది. పెళ్లి కాక ముందు ఏదో జరిగిపోయింది, అయితే పెళ్లయ్యాక మటన్ మానేయాలి అని షరతు పెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

కానీ ఆమె మాత్రం మటన్ పై ప్రేమను చంపుకోలేకపోయింది. భర్త మాటను పక్కకు పెట్టి మటన్ తినడం ప్రారంభించింది. ఈ విషయం భర్తకు తెలిసిపోయింది. అంతే, అతడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. భార్యతో గొడవకు దిగాడు. మ్యాటర్ ఎంతవరకు వెళ్లిందంటే.. ”నీకు మొగుడు కావాలో.. మటన్ కావాలో.. తేల్చుకో” అని భార్యకు చెప్పాడు. ఆమెకి కాస్త టైమ్ కూడా ఇచ్చాడు.

భార్యతో గట్టిగానే మాట్లాడాడు కానీ, అతడికి ఓ బెంగ పట్టుకుంది. తన భార్య ఎవరిని ఎంచుకుంటుందోనని వర్రీ అయ్యాడు. తనను కాదని మటన్ కావాలని అంటే పరిస్థితి ఏంటని కంగారుపడ్డాడు. ఇక తట్టుకోలేక, తన సమస్యను వివరిస్తూ.. ఓ ఫ్యామిలీ కౌన్సిలర్‌కి లేఖ రాశాడు.

ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై కౌన్సిలర్ తనదైన శైలిలో రిప్లయ్ ఇచ్చాడు.” డియర్ ప్యూర్ వెజ్ .. మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రపంచ రికార్డు సృష్టించనుంది.. ఒక మనిషి, మేకలలో ఎవరు కావాలని ఒక అమ్మాయిని అడిగితే .. నా అభిప్రాయం ప్రకారం ఆమె మేకనే ఎన్నుకొంటుంది.. ఎందుకంటే ప్రేమించిన వాడు లేకపోయినా ఉండొచ్చు. కానీ, తిండి లేకపోతే ఉండలేరు కదా.. ఇప్పుడు నీ భార్య ఎవరిని ఎంచుకుంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా” అంటూ సమాధానం ఇచ్చాడు.

Android apps : స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరిక.. ఈ యాప్స్ యమ డేంజర్.. బ్యాంకు ఖాతాలు ఖాళీ

ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ, కౌన్సిలర్‌ ఇచ్చిన సమాధానం అన్నీ ఓ పేపర్‌లో వచ్చాయి. ఈ క్లిప్పింగ్‌ని పరణ్‌ జాయ్‌ అనే జర్నలిస్ట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రసుత్తం ఇది తెగ వైరలవుతోంది. అంతేకాదు నవ్వులు పూయిస్తోంది.