Rahul Gandhi: నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసింది.. ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సంతతి విద్యావేత్త...

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సంతతి విద్యావేత్త డాక్టర్ శ్రుతి కపిలా రాజీవ్ గాంధీ వర్ధంతిని ప్రస్తావించి హింస, వ్యక్తిగతంగా మనుగడ సాగించడం ఎలా అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ బదులిస్తూ.. నా జీవితంలో అతిపెద్ద అభ్యసన అనుభవం మా నాన్న మరణం. అంతకంటే అతిపెద్ద ఘటన ఏదీలేదు. అయితే మా నాన్నను చంపిన దళం చేసిన పని నాకు అత్యంత బాధను మిగిల్చింది. ఓ కొడుకుగా నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసింది.

Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య

అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించింది. అందుకే మీరు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నంతకాలం దుర్మార్గులు ఎలా ఉన్నా పర్వాలేదు అంటూ రాహుల్ గాంధీ బదులిచ్చారు. బలమైన శక్తులను ఎదుర్కొనే సమయం ఎప్పుడూ బాధపడాల్సి వస్తుంది. అదే సమయంలో అటువంటి శక్తులపై ఎలా పోరాడాలో తెలుస్తుందంటూ రాహుల్ పేర్కొన్నారు. రాజకీయాలు అనేవి సరదాగా చేసుకొనే వ్యాపారం మాత్రం కాదు. రాజకీయ నాయకుడు ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండి వారి బాగోగుల కోసం ఎల్లప్పుడూ పని చేయాలి అంటూ రాహుల్ పేర్కొన్నారు. భారత ప్రత్యేకతను చాటే కీలక వ్యవస్థలపై ప్రణాళికాబద్ధ దాడి జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. కీలక వ్యవస్థల గొంతు నొక్కేసి, ఆ స్థానంలోకి ప్రవేశించిన తెరవెనుక శక్తులు, తమ సొంత బాణీని వినిపిస్తున్నాయన్నారు.

Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక

దేశానికి ఆత్మగా భావించే కీలకమైన పార్లమెంట్, ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో ఉంచుకుందని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ చెప్పే దార్శనికత దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సమ్మిళితం చేసేది కాదన్న రాహుల్.. 20 కోట్ల మంది ప్రజలను ఏకాకులుగా మారుస్తూ వారిని దుష్టులుగా చిత్రీకరించడం అత్యంత ప్రమాదకరమని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాలపై అవసరమైతే జీవితకాలం పోరాడతామంటూ రాహుల్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు