ప్రియుడితో Quarantine కు వెళ్లిన Nagpur Lady Constable..సీన్ కట్ చేస్తే

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 11:44 AM IST
ప్రియుడితో Quarantine కు వెళ్లిన Nagpur Lady Constable..సీన్ కట్ చేస్తే

Updated On : July 17, 2020 / 2:07 PM IST

కరోనా వేళ షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ వైరస్ ను అడ్డు పెట్టుకుని..ఇష్టమొచ్చినట్లుగా వాడేస్తున్నారు. అక్రమ సంబంధాలకు సైతం వాడుకుంటున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ తెలివి తెలుసుకుని అందరూ నోరెళ్లబెట్టారు. క్వారంటైన్ కేంద్రానికి ఏకంగా లవర్ తో వెళ్లి…ఏకాంతంగా గడిపి అడ్డంగా బుక్ అయ్యింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.

అసలు విషయం ఏమిటంటే : –

నాగ్ పూర్ పట్టణంలో ఓ మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్ లో ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా…పోస్టల్ ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. ఇతనికి అప్పటికే పెళ్లి అయ్యింది. ఇంకేముంది..ఈ పరిచయం కాస్తా..శారీరక సంబంధానికి దారి తీసింది.

పోలీసు అధికాారికి కరోనా పాజిటివ్ : – 
నాగ్ పూర్ కు చెందిన ఓ పోలీసు అధికారికి కరోన పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఎవరు సన్నిహితంగా ఉన్నారో…వారిని క్వారంటైన్ కు తరలించారు. Nagpur Lady Constable తన భర్త అంటూ ప్రియుడిని పరిచయం చేసింది. దీంతో అధికారులు భార్యభర్తలే అని నమ్మి…క్వారంటైన్ లో ఒకే గది కేటాయించారు. ఇంకేముంది. ఫుల్ ఎంజాయ్ చేశారు.

నా భర్త ఎక్కడ ? : –
ఇదిలా కొనసాగుతుండగానే…తన భర్త మూడు రోజులుగా కనిపించడం లేదంటూ…అతడి భార్య బజాజ్ నగర్ పీఎస్ లో పోలీసులకు కంప్లైట్ చేసింది. విచారణలో షాకింగ్ న్యూస్ వెలుగు చూశాయి. క్వారంటైన్ కేంద్రంలో ఉన్న Lady Constable కు వివాహం కాలేదని, అవివాహితురాలని తేలడంతో డిపార్ట్ మెంట్ వారు ఖంగుతిన్నారు. ప్రస్తుతం ఆ పోస్టల్ ఉద్యోగిని హుటాహుటిన మరో క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.