Narada Scam : నారద స్కామ్..సీబీఐ అప్పీల్ ఉపసంహరణకు సుప్రీం అనుమతి

నారదా కుంభకోణం కేసులో నలుగురు తృణముల్ కాంగ్రెస్ నేతలను జ్యుడిషీయల్ కస్టడీకి తీసుకోకుండా..హౌస్ అరెస్ట్ కు అనుమతిస్తూ మే-21న కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే

Narada Scam నారదా కుంభకోణం కేసులో నలుగురు తృణముల్ కాంగ్రెస్ నేతలను జ్యుడిషీయల్ కస్టడీకి తీసుకోకుండా..హౌస్ అరెస్ట్ కు అనుమతిస్తూ మే-21న కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కలకత్తా హైకోర్టు ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంని ఆశ్రయించింది సీబీఐ. అయితే కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్​ చేసిన అప్పీల్​ ను ఉపసంహరించుకోవాలని సీబీఐ నిర్ణయించింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలపై అప్పీల్​ను వెనక్కి తీసుకునేందుకు సీబీఐకి అనుమతించింది సుప్రీంకోర్టు. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడే తేల్చుకోవాలని సోమవారం సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

సోమవారం సీబీఐ అప్పీల్​ను పరిశీలించిన జస్టిస్​ వినీత్​ శరణ్, జస్టిస్​ బీఆర్​ గవాయ్​లు సభ్యులుగా గల సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నారదా కేసులో కలకత్తా హైకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టినట్లు స్పష్టం చేసింది. తమ అప్పీల్​ను వెనక్కి తీసుకునేందుకు సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతాకు అనుమతించింది. ఎలాంటి సమస్యలున్నా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. బెంగాల్​ ప్రభుత్వం, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు తమ వాదనలు వినిపించేందుకు స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు