మన్ కీ బాత్ : రాజకీయాల్లోకి వెళ్లాలని ఏ రోజూ అనుకోలేదు

  • Publish Date - November 24, 2019 / 08:12 AM IST

విజ్ఞానం కోసం పుస్తకాలు చదవడం మానేస్తున్నారు..గూగుల్‌లో వెతుకుతున్నారు..అంటూ వ్యాఖ్యానించారు భారత ప్రధాని మోడీ. జీవన విధానమంతా..ప్రకృతితోనే ముడిపడి ఉందన్నారు. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో అభిప్రాయాలను పంచుకున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ విద్యార్థులకు చేటుగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిట్ ఇండియా విషయంలో పాఠశాలలకు ర్యాంకులు కేటాయించాలన్నారు. రాజకీయాల్లోకి వస్తానని చిన్నతనంలో అనుకోలేదని చెప్పిన ఆయన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు. అయోధ్య అంశంపై కూడా మాట్లాడారు. 

> ఎన్ సీసీ దినోత్సవం సందర్భంగా ప్రస్తుత క్యాడెట్లు, మాజీ క్యాడెట్లందరినీ అభినందిస్తున్నా. 
> గ్రామ పాఠశాలలో ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉండడం తన అదృష్టం. అందుకే ఈ క్రమశిక్షణ, యూనిఫాం తనకు తెలుసు. దానివల్ల విశ్వాసం పెరుగుతుంది. 
> డిసెంబర్ 07వ తేదీన సాయుధ దళాల దినోత్సవం. సైనికుల త్యాగం, ధైర్యాన్ని గుర్తుంచుకుంటాం. వారి అంకితభావానికి కృతజ్ఞతలు తెలియచేయాలి. 
> అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు సమయంలో ప్రజలు చూపిన సద్బావన హర్షణీయం. శాంతి, ఏకత, సౌభ్రాతత్వమే నినాదం. 

తన అంతరంగాన్ని ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌ని ఇటీవలే తిరిగి ప్రారంభించారు ప్రధాని మోడీ. రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం జూన్ 30న తొలి సందేశం వినిపించారు. ఈ కార్యక్రమంపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి 1800117800 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. నమో యాప్, మైగప్ సైట్ ద్వారా కూడా ప్రజలు తమ సందేశాన్ని పంపే అవకాశం ఉందన్నారు మోడీ.