Narendra Modi : సర్జికల్ స్ట్రైక్స్ రోజు ఫోన్ పక్కనే కూర్చున్నా : మోదీ
ది దేశ ప్రజలను గర్వంతో ఉప్పొంగేలా చేసింది. ఆరోజును ఎప్పటికీ మరిచిపోను.

Modi At Nowshera
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీపావళి రోజున జమ్ముకశ్మీర్ లోని నౌషెరా సెక్టార్ లో పర్యటించారు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలొదిలిన సైనికులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత.. సైనికులతో మాట్లాడారు. వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. సైనికులకు స్వీట్లు తినిపించారు.
సైనికులతో సరదాగా గడిపిన మోదీ.. తాను ప్రతీ దీపావళిని బోర్డర్ లోనే సెలబ్రేట్ చేసుకున్నట్టు గుర్తుచేశారు. ఈ సందర్భంగా సర్జికల్ స్ట్రైక్స్ తాలూకు సంఘటనలు గుర్తుచేసుకున్నారు మోదీ.
Read This : Narendra Modi : కశ్మీర్ బోర్డర్‌లో సైన్యంతో మోదీ దీపావళి – ప్రసంగం Live
సైనికులు సర్జికల్ స్ట్రైక్ రోజు చూపిన తెగువ మరిచిపోనిది. అది దేశ ప్రజలను గర్వంతో ఉప్పొంగేలా చేసింది. ఆరోజును ఎప్పటికీ మరిచిపోను. ఆరోజు సాయంత్రం కల్లా సైనికులు తిరిగి వచ్చేయాలని మేమంతా ముందే నిర్ణయించాం. ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా వాకబు చేశాను. ఆ రోజంతా ఫోన్ పక్కనే ఉన్నా. సైనికుల యోగక్షేమాలు తెల్సుకుంటూ గడిపాను.