లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే.. 150 సభలు.. దక్షిణాదిన..

Lok Sabha Elections 2024: దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు ఉంటాయి.

Modi

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 150 సభలు/రోడ్ షోలు నిర్వహించనున్నారు. దక్షిణాదిన ఫోకస్ పెంచారు. మార్చి 25న హోలీ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రచారం ప్రారంభమవుతుంది. ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహిస్తారు. దక్షిణ భారతదేశంలో 35 నుంచి 40 సభలు, సమావేశాలు ఉంటాయి.

కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 303 స్థానాల్లో 224 సీట్లలో బీజేపీకి 50శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. ఈ సారి ఆయా స్థానాల్లో ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా కొత్తగా గెలవబోయే స్థానాల్లోనూ 50శాతం ఓట్లు పొందాలని బీజేపీ భావిస్తోంది.

మోదీ సభలు ఎక్కడెక్కడ?

  • అసోంలో 1 లేదా 2 సభలు
  • యూపీలో 15 కంటే ఎక్కువ సభలు, రోడ్ షోలు
  • యూపీలో కాన్పూర్, లఖ్‌నవూ, గోరఖ్‌పూర్, వారణాసి, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్, మొరాదాబాద్, మీరట్, బరేలీ, ఆగ్రాలలో ప్రధాని సభలు
  • నామినేషన్ రోజు కూడా వారణాసిలో ప్రధాని రోడ్ షో నిర్వహించేలా ఏర్పాట్లు
  • ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా యూపీ సహా దేశవ్యాప్తంగా సభలు
  • మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మతో యూపీ, బిహార్‌లో ప్రచారం

Also Read: ఆపరేషన్‌ లోటస్‌.. బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ సీనియర్ నేత

ట్రెండింగ్ వార్తలు