ఆపరేషన్‌ లోటస్‌.. బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ సీనియర్ నేత

BJP: జలగం వెంకట్రావును ఖమ్మం స్థానం నుంచి బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది.

ఆపరేషన్‌ లోటస్‌.. బీజేపీలో చేరనున్న బీఆర్ఎస్ సీనియర్ నేత

Kishan Reddy meets Sitaram Naik

Updated On : March 8, 2024 / 5:23 PM IST

Operation Lotus: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ వేగం పెంచింది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కమలనాథులు.. ఇప్పుడు అదే దారిలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావునూ ఆకర్షిస్తున్నారు.

మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తో వరంగంల్‌లోని ఆయన ఇంట్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ నేతలతో కలిసి హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్లారు కిషన్ రెడ్డి. సీతారాంనాయక్‌ను సాదరంగా బిజెపిలోకి ఆహ్వానించారు. కిషన్ రెడ్డి-సీతారాంనాయక్ భేటీ ఆసక్తి రేపుతోంది.

కొన్ని రోజులుగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై సీతారాం నాయక్ అసంతృప్తిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అంటున్నారు బీజేపీ నేతలు. సీతారాం నాయక్ చేరితే మహబూబాబాద్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే జలాగం వెంకట్రావుతో సైతం బీజేపీ మాట్లాడినట్లు సమాచారం.

జలగం వెంకట్రావును ఖమ్మం స్థానం నుంచి బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. వరంగల్ ఎంపీ స్థానం కోసం మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరురి రమేశ్‌తో బీజేపీ చర్చలు జరపింది. పెద్దపల్లి టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు మిట్టపల్లి సురేందర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

 Also Read: కేటీఆర్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తను తీవ్రంగా కొట్టిన ఎస్సై? కేటీఆర్ స్పందన