Narendra Modi
PM Narendra Modi Taking Oath : దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. 2014 తరువాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. ఎన్డీయే కూటమి పక్షాల మద్దతుతో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎన్డీయే పక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశంకు హాజరవుతున్నారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా ఎన్డీయే పక్ష నేతలు లేఖలు ఇవ్వనున్నారు.
Also Read : జగన్ ఓటమికి ప్రధాన కారణం అదే.. చంద్రబాబు గుణపాఠం నేర్చుకోవాలి : సీపీఐ నారాయణ
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 8వ తేదీ రాత్రి 8గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. జవహర్ లాల్ నెహ్రు తరువాత వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా మోదీ రికార్డుకెక్కనున్నారు. ఇదిలాఉంటే ఎన్డీయేలో కేంద్ర మంత్రి పదవులకు డిమాండ్ పెరిగింది. ఏపీ నుంచి టీడీపీ కూటమికి 3 నుంరి 5 మంత్రి పదువులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జేడీయూకి 2 నుంచి మూడు, ఎల్జేపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ఏఎం, అప్పాదళ్, శివసేన షిండే వర్గంకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : లోక్‌సభ ఫలితాల తర్వాత.. నితీశ్ కుమార్‌పై సోషల్ మీడియాలో హోరెత్తుతున్న మీమ్స్.. ఎందుకంటే?
మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ 16, జేడీయూ 12, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 7, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 5 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారు.