ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరణ.. రైతుల ఫైలుపై తొలి సంతకం

సౌత్ బ్లాక్ లోని పీఎం కార్యాలయంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. రైతులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.

ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరణ.. రైతుల ఫైలుపై తొలి సంతకం

PM Narendra Modi

Updated On : June 10, 2024 / 1:05 PM IST

PM Modi : వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఉదయం సౌత్ బ్లాక్ లోని పీఎం కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రైతులకు సంబంధించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. సుమారు రూ. 20వేల కోట్లు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు ప్రధానికి చప్పట్లతో కార్యాలయంలోకి పీఎంఓ సిబ్బంది స్వాగతం పలికారు.

Also Read : మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..

అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. రైతుల సంక్షేమంకోసం వీలైనంత వరకు కృషి చేయాలని, మా ప్రభుత్వం దీనికోసం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామని మోదీ చెప్పారు.

ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ 2014, 2019 ఎన్నికల్లో విజయం తరువాత రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోదీ ప్రధానిగా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానితో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, సోమవారం ఉదయం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను మోదీ సొంతం చేసుకున్నారు.