Modi Birthday: తల్లిలేకుండా జరుపుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు.. 72 ఏళ్లపాటు హీరాబెన్ మోదీతో..

ఏ గొప్ప పని తలపెట్టినా తల్లి ఆశీర్వాదం తీసుకుని, ఆమె వద్ద కొంత చిల్లర తీసుకుని, ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసేవారు మోదీ.

Heeraben Modi- Heeraben Modi

Modi 73rd birthday: నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ… (Narendra Modi) ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రధాని ఆయన.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలిస్తోన్న నేత.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఆయన చేతుల్లోనే ఉంది.

టీ అమ్ముకునే సాధారణ కూలీ స్థాయి నుంచి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎన్నో అత్యద్భుత విజయాలు సాధించారు. అయినప్పటికీ, ఎవరూ చేయలేని పనులు ఎన్నో చేసినప్పటికీ ఓ తల్లికి కుమారుడే. మోదీ వంటి గొప్ప నాయకుడిని భారతావనికి అందించి, దేశ రుణం తీర్చుకున్న మాత హీరాబెన్ మోదీ (Heeraben Modi). 1950, సెప్టెంబరు 17న ఆమె నరేంద్ర మోదీకి జన్మనిచ్చారు.

అప్పటి నుంచి గత ఏడాది సెప్టెంబరు 17 వరకు హీరాబెన్ మోదీ లేకుండా, ఆమె పలుకులు వినకుండా మోదీ పుట్టినరోజు వేడుకను జరుపుకోలేదు. హీరాబెన్ మోదీ లేకుండా మోదీ జరుపుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు ఇది. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలోని విస్‌నగర్ లో హీరోబెన్ 1923లో జన్మించారు. గత ఏడాది డిసెంబరు 30న కన్నుమూశారు.

ఏ గొప్ప పని తలపెట్టిన తల్లి ఆశీర్వాదం తీసుకుని, ఆమె వద్ద కొంత చిల్లర తీసుకుని, ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసేవారు మోదీ. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో, దేశానికి ప్రధానిగా కొనసాగుతున్న సమయంలోనూ ఎన్నో పుట్టినరోజు వేడుకలను అమ్మ వద్దే జరుపుకున్నారు మోదీ.

ఎంతమంది గొప్ప షెఫ్‌లు ఎన్ని రకాల వంటకాలు వండిపెడుతున్నా అమ్మ చేసిపెట్టిన వంట రుచి అంటేనే మోదీకి బాగా ఇష్టం. మోదీకి 70 ఏళ్లు వచ్చినప్పటికీ ఆయనకు హీరాబెన్ గోరు ముద్దలు తినిపించేవారు. చిన్ననాటి నుంచి మోదీకి తల్లి హీరాబెన్ ఎంతగానో మద్దతుగా ఉండేవారు. ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలకూ మద్దతు తెలిపారు.

Also Read: ఢిల్లీలో మరో అద్భుతం ‘యశోభూమి’.. ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకుకు స్వయంగా వెళ్లి డబ్బులు తీసుకుని తన కుమారుడి నిర్ణయానికి మద్దతు తెలిపారు. కుమారుడు దేశానికి ప్రధాని అయినప్పటికీ సాధారణ జీవితాన్నే గడిపారు. ఆమె లేకుండా, ఆమె తలపులతో మోదీ జరుపుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు ఇది.

Also Read: నితీశ్ మళ్లీ బీజేపీతో చేతులు కలపనున్నారా? 2017లో అచ్చం ఇలాగే మోదీని కలిశాక ప్లేట్ తిప్పేశారు