నాసా హెచ్చరిక.. భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏం జరగనుందంటే?

గ్రహశకలం భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలో మీటర్ల దూరంలో వెళ్తుంది. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరంకంటే నాలుగు రెట్లు ఎక్కువ. అయితే..

నాసా హెచ్చరిక.. భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏం జరగనుందంటే?

Asteroid towards Earth

NASA Warning : అంతరిక్షంలో తిరిగే గ్రహశకలం ఒకటి భూమి వైపుకు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఈ గ్రహశకలం గంటకు 65వేల కిలో మీటర్ల వేగంతో పయనిస్తుందని.. మరో రెండు రోజుల్లో భూమికి సమీపంలో వెళ్తుందని నాసా తెలిపింది. ఈ గ్రహశకలంతో భూమికి ఏమైనా ప్రమాదం ఉందా.. గ్రహశకలం నుంచి ఎదురయ్యే ముప్పును తప్పించడం సాధ్యమవుతుందా.. అసలు నాసా ఏం చెబుతుందనే వివరాల్లోకి వెళ్లితే..

Also Read : ధోనీ పుట్టినరోజు వేడుకల్లో భార్య సాక్షి ఏం చేసిందో చూశారా.. వీడియో వైరల్

గ్రహశకలం 2024 ఎంటీ1 కు సంబంధించి నాసా హెచ్చరిక జారీ చేసింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో సుమారు 260 అడుగులు ఉన్న ఈ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తుందని తెలిపింది. ఇది గంటకు సుమారు 65,215 కిలో మీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తుందని వెల్లడించింది. ఇది జూలై 8వ తేదీ నాటికి భూమికి అతి సమీపంలోకి వస్తుందని నాసా స్పష్టం చేసింది. 2024 ఎంటీ1 గ్రహశకలం భూమివైపుకు దూసుకొస్తున్న విషయాన్ని భూమికి దగ్గరగా వచ్చే గ్రహశకలాలు, తోకచుక్కలను ట్రాక్ చేసే నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ ద్వారా కనుగొన్నట్లు నాసా తెలిపింది. ఈ ఆస్టరాయిడ్స్ గంటకు 65వేలకుపైగా వేగంతో దూసుకొస్తున్నప్పటికీ ఇప్పుడు భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా తెలిపింది.

Also Read : ప్రజాభవన్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. ఫొటోలు వైరల్

గ్రహశకలం భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కిలో మీటర్ల దూరంలో వెళ్తుంది. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరంకంటే నాలుగు రెట్లు ఎక్కువ. అయితే ఈ పరిమాణంలో ఉన్న గ్రహశకలాలు భూమిని ఢీకుంటే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని నాసా తెలిపింది. 2024 ఎంటీ1 వంటి గ్రహశకలం ప్రభావం భారీ పేలుళ్లు, సునామీతో జరిగే నష్టానికి సమానమని, అయితే, నాసా ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ అలాంటి ప్రమాదాలను నియంత్రించేందుకు పనిచేస్తుందని నాసా వెల్లడించింది. డబుల్ ఆస్టరాయిడ్ రీ డైరెక్షన్ టెస్ట్ మిషన్ వ్యోమనౌకను క్రాస్ చేయడం ద్వారా గ్రహశకలాన్ని మళ్లించే సాధ్యాసాధ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాసా తెలిపింది. అయితే.. ఇది 2024 ఎంటీ1కి సంబంధించినది కాకపోయినప్పటికీ గ్రహశకలాల డైవర్షన్ లో ఓ ముందడుగు సాధించినట్లు నాసా తెలిపింది. అయితే, 2024 ఎంటీ1 భూమికి చేరువగా వెళ్తున్నందున దాని చిత్రాలు, డేటాను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.