National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు.. రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

National Herald Case ED Assets Attachment : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో ఆస్తులను  ఈడీ జప్తు చేయడాన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (PMLA) అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది. జప్తు చేసిన చరాస్తులు, ఈక్విటీ షేర్లు క్రైమ్ ప్రొసీడింగ్స్ గా ఉన్నాయని ఈడీ పేర్కొంది. ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబై, లక్నోలో, కొన్ని ఇతర ప్రదేశాలలో భూములు, భవనాల వంటి ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ట్రయల్ కోర్టు ప్రాసిక్యూషన్ (ED)కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఆస్తులను ఈడీ జప్తుచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేత ప్రచురించబడిందే నేషనల్ హెరాల్డ్ పత్రిక. యంగ్ ఇండియన్ లిమిటెడ్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెరో 38శాతం వాటాతో మెజార్టీ వాటాదారుగా ఉన్నారు. ఇప్పటికే సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ ప్రశ్నించింది. 2014 నుంచి నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ దర్యాప్తు జరుపుతుంది.

Also Read : Hardik Pandya stepbrother : రూ.4.3కోట్ల మోసం.. హార్దిక్ పాండ్య సోద‌రుడి అరెస్ట్‌..

‘నేషనల్ హెరాల్డ్’ వార్తాపత్రికను 1938లో జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించారు. మొదట అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురించబడింది. నేషనల్ హెరాల్డ్ ఈక్విటీ లావాదేవీ సమయంలో రూ. 2,000 కోట్లకుపైగా ఆస్తుల దుర్వినియోగానికి గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. 2008లో కాంగ్రెస్ నుండి రూ.90కోట్ల రుణాన్ని పునరుద్ధరించడంలో విఫలమవడంతో వార్తాపత్రిక మూతపడింది. 2010లో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (YIL) అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)ని కొనుగోలు చేసింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్లుగా సోనియా, రాహుల్, ఖర్గే ఉన్నారు.

Also Read : National Herald Case: ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కేం సంబంధం..

2012లో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కాంగ్రెస్ నేతలు విశ్వాస ద్రోహం చేశారని, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎజెఎల్ కొనుగోలుపై మోసం చేశారని ఆరోపణలు చేశారు. కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం థర్డ్ పార్టీతో ఆర్థిక వ్యాపారం చేయడానికి ఏ రాజకీయ సంస్థకు అనుమతి లేదని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాభాలకోసం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. ఎజెఎల్ కాంగ్రెస్ పార్టీకి చెల్లించాల్సిన 90కోట్ల రూపాయలను తిరిగి పొందే హక్కుకోసం యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం 50లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన 89.5 కోట్ల రూపాయలను ఎగ్గొట్టి వేల కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు