IAF Air Strikes : ఇదిగో ఆధారం

  • Publish Date - March 4, 2019 / 03:44 PM IST

బాలాకోట్‌లో భారత వాయుసైన్యం దాడి చేసిందా చేయలేదా ?  చేస్తే ఆధారాలు చూపించాలని కేంద్రాన్ని విపక్షాలు అడుగుతున్నాయి. ఇలాంటి సమయంలో.. ఓ కీలక రిపోర్ట్‌ బయటకు వచ్చింది. ఇండియాలో ఉన్న నేషనల్‌ టెక్నికల్ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ మన అద్భుతమైన సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం ప్రకారం.. దాడి జరిగిన రోజు ఉదయం 3.30లకు బాలాకోట్‌ ఏరియాలో దాదాపు 300 ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నాయి. అంటే అక్కడ దాదాపు 300 మంది ఉగ్రవాదులున్నట్లు పక్కా ఆధారాలు లభించిన తర్వాతే.. వాయిసేన దాడిచేసింది. 

మరోవైపు మసూద్‌ అజార్‌ బతికే ఉన్నాడని పంజాబ్ ప్రావిన్స్‌ కల్చరల్‌ శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి 03వ తేదీ ఆదివారం నుంచి మసూద్ చనిపోయాడని సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లకు ఫయాజ్ హుస్సేన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టారు.