Plastic Bottles: ఆ రాష్ట్రంలో ప్యాకేజ్‌డ్ మినరల్ వాటర్ దొరకదంతే

ప్రతి ఒక్కరు బాటిల్స్ లో ఉండే మినరల్ వాటర్ కు దూరంగా ఉండాలి. సహజంగా దొరికే నీటినే తాగాలని సీఎం చెప్పారు.

Plastic Bottles: ఆ రాష్ట్రంలో ప్యాకేజ్‌డ్ మినరల్ వాటర్ దొరకదంతే

Plastic Bottles

Updated On : October 2, 2021 / 10:00 PM IST

Plastic Bottles: సహజ పద్ధతిలో దొరికే మంచి నాణ్యత కలిగిన తాగు నీరును ప్యాకేజ్‌డ్ బాటిల్స్‌లో నిల్వ చేయడాన్ని నిషేదించింది సిక్కిం ప్రభుత్వం. ఈ మేరకు సిక్కిం సీఎం పీఎస్ తమంగ్.. 2022 జనవరి 1నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ లో స్టోరేజ్ చేసే నీటిని నిషేదిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా మాట్లాడిన ఆయన నేచురల్ రిసోర్సుల నుంచి నీరు సేకరించి ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని చెప్పారు.

సిక్కింలోని ప్రతి ఒక్కరు బాటిల్స్ లో ఉండే మినరల్ వాటర్ కు దూరంగా ఉండాలి. సహజంగా దొరికే నీటినే తాగాలి అని చెప్పారు. ఇదంతా అమలు కావడానికి సమయం పడుతుంది కాబట్టి మూడు నెలల్లోగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

గవర్నర్ గంగా ప్రసాద్ తో పాటు క్లీన్‌లీనెస్ డ్రైవ్ లో పాల్గొన్న తమంగ్.. బయట ప్రాంతాల నుంచి సరఫరా అయ్యే ప్యాకేజ్ డ్ డ్రింకింగ్ వాటర్ ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేస్తుందన్నారు. ఇప్పటికే వచ్చిన నీరు కొద్ది రోజుల్లో అయిపోతుందని చెప్పారు. టూరిస్ట్ స్పాట్ అయిన నార్త్ సిక్కిం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ నిషేదించారు.

………………………………………..: భారత్‌ మార్కెట్లోకి 5 అమెరికన్‌ బ్రాండ్‌ టీవీలు.. రూ. 7,999 ప్రారంభ ధరతో!

నేచురల్ వాటర్ రిసోర్సుల్లో సిక్కిం సమృద్ధిగా ఉన్నాయి. పర్యావరణ అనుకూల కార్యక్రమాలు చేపట్టి.. రాష్ట్రంలో సహజమైన తాగునీరు దొరికేలా చేస్తామని సీఎం అన్నారు.