Bijapur Encounter: బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 20మంది నక్సలైట్లు మృతి

ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

Bijapur Encounter: బీజాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు – నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది నక్సలైట్లు మృతి చెందారు. 11 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. ఇతర చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

అటు..ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు అడవుల్లో మళ్లీ అలజడి మొదలైంది. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ మళ్లీ మొదలు పెట్టారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశాయి. పాక్, భారత్ యుద్ధం కారణంగా ఆపరేషన్ కగార్ నుంచి కొంతమంది బలగాలను కేంద్రం వెనక్కి రప్పించింది. ఇప్పుడు యుద్ధానికి బ్రేక్ పడటంతో మళ్లీ బలగాలను కర్రెగుట్టలోకి పంపినట్లు తెలుస్తోంది. గత రాత్రి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు కర్రెగుట్టలోకి ప్రవేశించినట్లు సమాచారం. కర్రెగుట్టను మళ్లీ జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు.

Also Read: భారత్‌, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం జరిగి ఉంటేనా..? ఆ యుద్ధాన్ని ఇలా ఆపాను: ట్రంప్