MLA Saroj Baboolal Ahire : నెలల వయసున్న పసిబిడ్డను తీసుకుని.. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మహిళా ఎమ్మెల్యే

మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే నెలల వయసున్న తన పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బాలింత అయినా కూడా బాధ్యతను మరిచిపోకుండా అసెంబ్లీకి వచ్చిన ఆ మహిళ ఎమ్మెల్యేపై సాటి ఎమ్మెల్యేలు ప్రశంసలు వర్షం జల్లు కురిపించారు.

MLA Saroj Baboolal Ahire : మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే నెలల వయసున్న తన పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బాలింత అయినా కూడా బాధ్యతను మరిచిపోకుండా అసెంబ్లీకి వచ్చిన ఆ మహిళ ఎమ్మెల్యేపై సాటి ఎమ్మెల్యేలు ప్రశంసలు వర్షం జల్లు కురిపించారు. నాగ్ పూర్ కు చెందిన మహిళా ఎమ్మెల్యే సరోజ్ బాబూలాల్ అహిరే నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ(ఎన్సీపీ)నాయకురాలు.

గత సెప్టెంబర్ 30వ తేదీన ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆమె తన మూడు నెలల పసిబిడ్డను తీసుకుని అసెంబ్లీకి వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నర సంవత్సరాలుగా మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగలేదని వెల్లడించారు.

Gujarat Polls: గుజరాత్ ఓటర్లకు జీతంతో కూడిన సెలవు ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

అందుకే ఇప్పుడు బాలింతను అయినా సమావేశాలకు హాజరుకావాల్సి వచ్చిందని సరోజ్ అహిరే పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాలేదని చెప్పారు. ఇప్పుడు హాజరుకాకపోతే ప్రజలకు తాను ఏం సమాధానం చెప్పాలన్నారు. అందుకే కష్టమైనా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వచ్చానని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు