Gujarat Polls: గుజరాత్ ఓటర్లకు జీతంతో కూడిన సెలవు ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

మహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అన్ని రంగాల ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు

Gujarat Polls: గుజరాత్ ఓటర్లకు జీతంతో కూడిన సెలవు ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

Maharashtra govt announces one day paid leave for Gujarat voters

Gujarat Polls: గుజరాత్ ఓటర్లకు జీతంతో కూడిన ఒక రోజు సెలవు ప్రకటించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఓటర్లకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు మంగళవారం మహారాష్ట్ర సీఎంవో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్, నాసిక్, నందుర్బార్, ధూలే జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న గుజరాత్ వాసులకు ఇది వర్తిస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో వీరంతా పని చేస్తారు. అందుకే వీరికి ఆ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అన్ని రంగాల ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. గుజరాత్‭లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

MCD elections: ఆప్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం.. దాడి చేసి తరిమికొట్టిన సొంత పార్టీ కార్యకర్తలు