Journalist Kamal: ప్రముఖ జర్నలిస్ట్ కమల్ ఖాన్ గుండెపోటుతో మృతి

ప్రముఖ జర్నలిస్ట్ ప్రస్తుతం NDTVలో పనిచేస్తున్న కమల్ ఖాన్ గుండెపోటుతో మరణించారు.

Journalist Kamal: ప్రముఖ జర్నలిస్ట్ కమల్ ఖాన్ గుండెపోటుతో మృతి

Kamal Khan

Updated On : January 14, 2022 / 11:45 AM IST

Journalist Kamal: ప్రముఖ జర్నలిస్ట్ ప్రస్తుతం NDTVలో పనిచేస్తున్న కమల్ ఖాన్ గుండెపోటుతో మరణించారు. లక్నోలోని బట్లర్ ప్యాలెస్ కాలనీలో ఈరోజు(14 జనవరి 2022) ఉదయం కమల్ మరణించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కమల్ ఖాన్ మరణవార్తతో జర్నలిజం లోకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమల్ ఖాన్ చురుకైన పాత్రికేయుడిగా గుర్తింపు పొందారు.

61 ఏళ్ల కమల్ ఖాన్ తన కుటుంబంతో కలిసి లక్నోలోని బట్లర్ ప్యాలెస్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు. జర్నలిస్ట్ రుచి కుమార్‌ను కమల్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. తెల్లవారుజామున అతని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కమల్ ఖాన్ NDTV ఉత్తరప్రదేశ్ బ్యూరో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్నారు.

కమల్ ఖాన్ గత మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నారు. 22 సంవత్సరాలుగా NDTVతో అనుబంధం కలిగి ఉన్నారు.

సీఎం యోగి సంతాపం:
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. ఇతర నాయకులు కమల్ ఖాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు . మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సీఎం యోగి తెలిపారు. ఇది జర్నలిజానికి తీరని నష్టం. కమల్ నిష్పాక్షిక జర్నలిస్ట్ అంటూ అభిప్రాయపడ్డారు.

సమాజ్ వాదీ పార్టీ కూడా కమల్ మృతిపట్ల ట్వీట్ చేస్తూ సంతాపం వ్యక్తం చేసింది.