Neelakurinji Flowers
Neelakurinji Flowers : సాధారణంగా పూలు ఎప్పుడు పూస్తాయి. ఒకటి రెండు..లేదా ఓ నాలుగైదు రోజుల్లో పూస్తాయి అంటారు కదా. కానీ ఓ మొక్కకు సంబంధించిన పూలు మాత్రం 12 ఏళ్లకు ఒకేసారి పూస్తాయి. పూలు పూసిన తర్వాత అవి చనిపోతాయి. వాటి విత్తనాలతో మొలకెత్తిన మొక్కలు మళ్లీ పూతకు రావాలంటే..పుష్కర కాలం వెయిట్ చేయాల్సిందే. ఇవి ప్రస్తుతం పూయడంతో అద్భుతమైన కమనీయ దృశ్యం కనిపించిందంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ‘ప్రపంచ ఫొటోగ్రఫీ’ దినోత్సవం రోజునే ఇలా జరగిందంటూ…కామెంట్స్ చేస్తున్నారు.
Read More : Netflix Hacks : ఈ 7 టాప్ నెట్‌ఫ్లిక్స్ హ్యాక్స్ తెలిస్తే.. ప్రోగా మారిపోవచ్చు!
ఇక మొక్క విషయానికి వస్తే..‘నీలకురింజి’. ఇవి పెరిగి..పూసిన తర్వాత చనిపోతాయని అంటున్నారు. అలా వాటి విత్తనాలతో మళ్లీ మొక్కలు వస్తాయి. కానీ మొక్కలు పూతకు రావాలంటే..అన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై – అక్టోబర్ నెలల కాలంలో ఇవి పూస్తాయి. మలయాళంలో ‘కురింజి’ అంటే పువ్వు అని, నీల అంటే నీలి రంగు అని అర్థం. ఈ పువ్వులు నీలం రంగులో ఉండడంతో ‘నీలకురింజి’ అని పేరు వచ్చిందని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ పువ్వులను చూసిన వారు ఎంతో కమనీయమైన దృశ్యంగా అభివర్ణిస్తున్నారు.
Karnataka | Neelakurinji flowers, which bloom once every 12 years, seen at Mandalapatti hill in Kodagu district. pic.twitter.com/DgpZaYoFQI
— ANI (@ANI) August 18, 2021