NEET Undergarments : దారుణం.. అమ్మాయిల లోదుస్తులు విప్పించి పరీక్ష రాయించిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు (బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమీ లేక విద్యార్థినులు అలానే చేశారు.

NEET Undergarments : దారుణం.. అమ్మాయిల లోదుస్తులు విప్పించి పరీక్ష రాయించిన సిబ్బంది.. ఎందుకో తెలుసా?

Neet Undergarments

Updated On : July 18, 2022 / 6:55 PM IST

NEET Undergarments : మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. 100 మంది విద్యార్థినుల పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు (బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. పరీక్షకు సమయం అవుతుండటంతో చేసేదేమీ లేక విద్యార్థినులు అలానే చేశారు. తాము ధరించిన బ్రాలు తొలగించారు.

క్లాసులో విద్యార్థినుల ముందే..మహిళా టీచర్‌కు ముద్దు పెట్టిన ఉపాధ్యాయుడు

కాగా, దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిబ్బంది తీరుపై అంతా మండిపడుతున్నారు. ఇదెక్కడి చోద్యం అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, సిబ్బంది మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. లో దుస్తులకు బెల్ట్స్ ఉండటం వల్లే అలా చేయాల్సి వచ్చిందని వివరించారు.

డ్రెస్ కోడ్ ప్రకారం విద్యార్థులు ఎగ్జామ్ హాల్ లోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి లోహపు వస్తువులు లేదా ఉపకరణాలు ధరించడానికి అనుమతించబడరని వారు వెల్లడించారు. ఇది యాంటీ చీటింగ్ చర్య అని వివరణ ఇచ్చారు. అయితే అండర్‌ వైరింగ్‌ని కలిగి ఉండే బ్రాలు వంటి లోదుస్తులకు ఈ రూల్ వర్తించదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, రూల్స్ పేరుతో సిబ్బంది ఓవరాక్షన్ చేశారని అంతా మండిపడుతున్నారు.

Murder For Jeans : బాబోయ్.. జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దన్న భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

కేరళ కొల్లంలోని మార్తోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘోరం జరిగింది. లోదుస్తులు విప్పించడాన్ని విద్యార్థినులు ఎంతో అవమానంగా ఫీలయ్యారు. సిబ్బంది తీరుతో పరీక్షకు ముందు తాము తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని, మానసిక క్షోభను అనుభవించామని వాపోయారు. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, దాదాపు 100 మంది బాలికలు ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కుప్పలు తెప్పలుగా ఉన్న లోదుస్తులను పరీక్ష అనంతరం అట్టపెట్టెల్లో పెట్టి సిబ్బంది పడేసినట్లు గుర్తించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw