క్లాసులో విద్యార్థినుల ముందే..మహిళా టీచర్‌కు ముద్దు పెట్టిన ఉపాధ్యాయుడు

ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల ముందే.. మహిళా టీచర్‌కు ముద్దిచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కరౌలి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో జరిగింది. అక్కడే ఉన్న విద్యార్ధినులంతా పకపకా నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే.. కరౌలి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థినులకు ఇద్దరు మహిళా టీచర్లు కౌన్సెలింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎలా చదువుకోవాలి? చదువు తరువాత ఎటువంటి ఉపాధి మార్గాలకుఎంచుకోవాలి? దానికి ఎటువంటి విధానలు అవలంభించాలి? వృత్తిపరంగా ఎలా ఎదగాలి? అనే అంశాలపై విద్యార్థినులకు ఓ మహిళా టీచర్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
అదే సమయంలో అప్పటి వరకూ క్లాస్ బైట ఉన్న ఓ ఉపాధ్యాయుడు.. కౌన్సెలింగ్ హాల్‌లోకి వచ్చాడు. మహిళా టీచర్ పక్కనే కూర్చున్నాడు. అలా కూర్చున్న కాసేపటికి ఆ టీచర్ వైపు వంగి ఆమెకు విద్యార్ధినిలు తోటి టీచర్ ముందే ఆ మహిళా టీచర్ చెంపపై ముద్దు పెట్టుకున్నాడు.
దీంతో అప్పటి వరకు సీరియస్‌గా ఉన్న విద్యార్థులు ఒక్కసారి నవ్వారు. ఏదో ఘనకార్యం చేసినట్లుగా సదరు ఉపాధ్యాయుడు చేతులు రెండూ పైకెత్తి విలాసంగా నవ్వుకున్నాడు. కానీ ఉపాధ్యాయుడు హఠాత్తుగా చేసి ప్రవర్తనపై ఆ టీచర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఇబ్బంది పడ్డారు. కౌన్సెలింగ్ ఇస్తున్న టీచర్ కూడా అది చూసి అదేదో చాలా సాధారణ విషయం అన్నట్టుగా నవ్వేసింది.
టీచర్‌కు ముద్దిచ్చిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఘటనపై రాజస్థాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రిని ప్రశ్నించినా ఆయన ఏమాత్రం స్పందించలేదు. అదో పెద్ద విషయం కాదన్నట్లుగా వేరే విషయం గురించి మాట్లాడి వెళ్లిపోయారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని చాలా సాధారణంగా చెప్పేశారు. కానీ సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని స్కూల్ ఉన్నతాధికారులు తెలిపారు.