Belly Dance In Local train : లోకల్ ట్రైన్లో యువతి బెల్లీ డ్యాన్స్ .. మండిపడుతున్న నెటిజన్లు
మెట్రో టైన్లలో డ్యాన్సులు..ప్రయాణీకుల ఫైంటింగులు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రైన్లలో డ్యాన్సులు వేస్తు కొంతమంది రీల్స్ చేయటం, డాన్సులు చేస్తు పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
Mumbai local train : ఇటీవల మెట్రో టైన్లలో డ్యాన్సులు..ప్రయాణీకుల ఫైంటింగులు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రైన్లలో డ్యాన్సులు వేస్తు కొంతమంది రీల్స్ చేయటం వంటి ఘటనలు జరుగుతున్నాయి.అటువంటిదే జరిగింది ముంబై లోకల్ ట్రైన్ (Mumbai local train) లో. లోకల్ ట్రైన్ లో ఓ యువతి బెల్లీ డాన్స్ (woman belly dance)చేసింది. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. బెల్లీని రకరకాలుగా తిప్పుతు..ఊపుతూ చేస్తున్న డ్యాన్స్ చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
ముంబైలోని సాండ్హర్స్ట్ రోడ్- మస్జిద్ స్టేషన్ల మధ్య రైలు ప్రయాణం మధ్యలో ఈ వీడియో రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. లోకల్ ట్రైన్లో అసభ్యకర రీతిలో బెల్లీ డ్యాన్స్ చేస్తున్నదని పలువురు కామెంట్ చేస్తు ముంబై పోలీసులకు (Mumbai police) ట్యాగ్ చేస్తున్నారు.
ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లటంతో పోలీసులు సదరు యువతిపై చర్యలు చేపట్టేందుకు యత్నించారు. ఇటువంటివి ముంబైలోని లోకల్ రైళ్లలో దిగజారుతున్న పరిస్థితికి నిదర్శనం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Entertainment
Now Belly Dancing inside Mumbai Local Train.
It seems #MumbaiLocal Trains are the most happening place..to showcase talent.
Locations seems to be @Central_Railway between Sandhurst Road & Masjid stations.@drmmumbaicr @RailMinIndia @RailMinIndia pic.twitter.com/LI1vFchnHw
— मुंबई Matters™ (@mumbaimatterz) September 19, 2023