India Covid : 8 లక్షల మందికి కరోనా పరీక్షలు..10 వేల కేసులు

24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు... కేంద్ర వైద్య ఆరోగ్య  శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని తెలిపింది.

Corona Cases In India : భారతదేశంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే..గతంలో కన్నా..తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండడం..భారీగా రికవరీ కేసుల శాతం పెరగడం ఊరటనిచ్చే అంశం. తాజాగా…24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు… కేంద్ర వైద్య ఆరోగ్య  శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని, ప్రస్తుతం దేశంలో…1,46,950 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది.

Read More : Etela Rajender : మొదటిసారి రాష్ట్ర బీజేపీ ఆఫీసుకు ఈటల… సన్మానానికి భారీ ఏర్పాట్లు!

దేశంలో 0.43 శాతం యాక్టివ్ కేసులున్నాయని, దేశంలో ఇప్పటి వరకు 3,43,44,683 కేసులు నమోదు కాగా..4,60,265 మరణాలు సంభవించాయి. దేశంలో 98.23 శాతం కరోనా రికవరీ రేటుగా ఉంది. కరోనా నుంచి 12 వేల 509 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,37,37,468 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో 2020 మార్చి తర్వాత..రికవరీ కేసుల శాతం పెరిగిందని తెలిపింది. భారత్ లో 61.39 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read More : Gambling : బేగంపేటలో పేకాట అడ్డాపై పోలీసుల దాడి..ప్రముఖ నాయకుడి జోక్యం ?

గడిచిన 24 గంటల్లో 8,10,783 టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా…61,39,65,751 మందికి టెస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా…3024 ల్యాబ్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. టెస్టుల కోసం దేశ వ్యాప్తంగా…ప్రజలకు 1336 ప్రభుత్వ ల్యాబ్స్, 1688 ప్రైవేటు ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు