Etela Rajender : మొదటిసారి రాష్ట్ర బీజేపీ ఆఫీసుకు ఈటల… సన్మానానికి భారీ ఏర్పాట్లు!
హుజూరాబాద్ ఉప ఎన్నికలో మెజార్టీ విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు రానున్నారు. ఈటల రాకతో బీజేపీ ఆఫీసు వద్ద సన్మానానికి భారీ ఏర్పాట్లు చేశారు.

Etela Rajender To Be Honoured In Bjp State Office First Time After Win Huzurabad Bypoll
Etela Rajender : హుజూరాబాద్ ఉప ఎన్నికలో మెజార్టీ విజయాన్ని సాధించిన ఈటల రాజేందర్ శనివారం (నవంబర్ 6) హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు రానున్నారు. ఈటల రాకతో బీజేపీ కార్యాలయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటలకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సన్మానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ విజయోత్సవ ర్యాలీ పేరిట ఈటల శామీర్ పేట నుంచి ర్యాలీ చేపట్టనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి తుమ్మికుంట, అల్వాల్, ప్యారడైజ్, రాణిగంజ్, గన్ పార్క్ మీదుగా బీజేపీ పార్టీ కార్యాలయానికి ఈటల చేరకోనున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించిన తరవాత మొదటిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఈటల వస్తుండటంతో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తరువాత శామీర్ పేట్ నుంచి భారీ కాన్వాయ్‌తో గన్ పార్క్ వద్దకు చేరుకోనున్నారు.
తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ అమరవీరులకు ఈటల నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి ఈటల వెళ్లనున్నారు. విజయం అనంతరం బీజేపీ పార్టీ ఆఫీకు వస్తున్న ఈటల ఏయే అంశాలపై మాట్లాడుతారోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అపాయింట్‌మెంట్ ఓకే అయితే వెంటనే ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ నేతల్ని ఈటల కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also : Bus Driver Escape : బస్సు రిపేరు అంటూ డబ్బులతో ఉడాయించారు.. ప్రయాణికుల అవస్థలు!