Bus Driver Escape : బస్సు రిపేరు అంటూ డబ్బులతో ఉడాయించారు.. ప్రయాణికుల అవస్థలు!

కేరళ నుంచి అస్సాం బయలుదేరిన వివిధ రాష్ట్రాలకు చెందిన 64 మంది ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు. ఎటు వెళ్లలేక అక్కడే ఉండలేక నరకయాతన పడుతున్నారు.

Bus Driver Escape : బస్సు రిపేరు అంటూ డబ్బులతో ఉడాయించారు.. ప్రయాణికుల అవస్థలు!

Bus Driver And Cleaner Escape With Bus After Name Of Repair, Leaves Passengers At Narketpally

Updated On : November 6, 2021 / 9:43 AM IST

Narketpally Bus : కేరళ నుంచి అస్సాం బయలుదేరిన వివిధ రాష్ట్రాలకు చెందిన 64 మంది ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు. ఎటు వెళ్లలేక అక్కడే ఉండలేక నరకయాతన పడుతున్నారు. రిపేరు పేరుతో బస్సును బస్టాండ్ లో ఆపేసి.. మెల్లగా బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రయాణికుల డబ్బులతో ఉడాయించారు. ఈ ఘటన నార్కట్ పల్లి సమీపంలోని ఓ హోటల్ దగ్గర చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నార్కట్ పల్లి సమీపంలోని పల్లె రుచులు హోటల్ దగ్గర భోజనానికి బస్సు ఆపారు. అదునుగా భావించి ప్రయాణికుల లగేజ్ , డబ్బులతో సహా బస్సు డ్రైవర్, క్లీనర్ ఉడాయించారు. విషయం తెలియగానే హోటల్ వద్దకు స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేరుకున్నారు. ప్రయాణికులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి భోజనం, గమ్యానికి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎమ్మెల్యే చిరుమర్తి దగ్గరుండి చూసుకున్నారు. ఒడిషా, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు.

కేరళలో పనిచేస్తున్న ప్రయాణికులంతా స్వరాష్ట్రాలకు తిరిగి బయల్దేరారు. మార్గమధ్యలో ట్రావెల్ బస్సు నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద ఆగిపోయింది. రిపేర్ అంటూ నమ్మబలికి బస్టాండులో ప్రయాణికులను దించేసి బస్సుతో పాటు డ్రైవర్, క్లీనర్ ఉడాయించారు. బస్సుల్లో ప్రయాణికుల లగేజీ, డబ్బులు అందులోనే ఉన్నాయి. బస్సు ఎంతసేపటి రాకపోవడంతో బస్టాండ్ లోని ప్రయాణికులు బస్సు డ్రైవర్ కు ఫోన్ చేయగా.. స్విచాఫ్ చేసేశారు. ఆరు గంటల పాటు బస్సులోనే గడిపినా ప్రయాణికులంతా కట్టుబట్లతోనే ఉండిపోయారు.

అసోంకి చెందిన 59 మంది, బీహార్ కు చెందిన మరో ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది. స్వగ్రామాలకు వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన ఒక ట్రావెల్ బస్సును బుకింగ్ చేసుకున్నారు. ఆదివారానికి అసోంకు చేరాల్సి ఉంది. బస్సు తిరిగిరాకపోవడంతో ప్రయాణికులు 100 నెంబర్ కు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు ప్రయాణికులకు భోజన సదుపాయాన్ని కల్పించారు. ప్రస్తుతానికి ఓ ఫంక్షన్ హాల్‌లో బస చేసేందుకు ఏర్పాటు పూర్తి చేశారు. ఉడాయించిన బస్సు డ్రైవర్, క్లీనర్ ఎందుకు ప్రయాణికులను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Gambling : బేగంపేటలో పేకాట అడ్డాపై పోలీసుల దాడి..ప్రముఖ నాయకుడి జోక్యం ?