Assam
Assam : రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నత విద్యాసంస్థల ఉపాధ్యాయులకు అసోం ప్రభుత్వం కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇకపై సాధారణ దుస్తులతో అక్కడ ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కాకూడదు.
Love Jihad : లవ్ జిహాద్ పై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
అసోం ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇకపై సాంప్రదాయ దుస్తుల్లో విధులకు హాజరు కావాలి. ఉన్నత విద్యాశాఖకు చెందిన కొందరు ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులు ధరించి వస్తున్నారని, అది ప్రజలకు ఆమోద యోగ్యంగా కనిపించడం లేదని ప్రభుత్వ దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం మగవారు ఫార్మల్ షర్ట్స్, ప్యాంటు, ధోతి మరియు పైజామా ధరించి విధులకు హాజరు కావాలి. పోలో టీ-షర్టు, డెనిమ్ జీన్స్ వంటి దుస్తులు ధరించకూడదు. మహిళా ఉపాధ్యాయులు సల్వార్ సూట్, చీర వంటి సాంప్రదాయ దుస్తులతో హాజరు కావాలి. టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివి ధరించకూడదు.
Meritorious Students : అసోంలో మెరిట్ విద్యార్థులకు స్కూటర్లు… సీఎం ప్రకటన
మగవారైనా, ఆడవారైనా ఉపాధ్యాయులు శుభ్రంగా, నిరాడంబరంగా నిండుగా కనిపించే రంగుల దుస్తులు ధరించాలని.. సాధారణమైన దుస్తులతో పాటు, పార్టీ వేర్ దుస్తులను మానుకోవాలని అధికారులు వారికి సూచించారు.