New FASTag Rules : నేటి నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్.. కొంచెం ఆలస్యమైనా భారీగా జరిమానాలు.. వాహనదారులు ఏమి చేయాలంటే?

New FASTag Rules : మీరు FASTag రీఛార్జ్ చేయడం మర్చిపోతే లేదా మీ ఖాతాలో ఏదైనా సమస్య ఉంటే, మీరు ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకోండి.

New FASTag Rules

New FASTag Rules : ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఈరోజు (ఫిబ్రవరి 17, 2025) సోమవారం నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. టోల్ లావాదేవీలను క్రమబద్ధీకరించడమే కాకుండా మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా కొత్త ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ రూల్స్ అనమాట..

జనవరి 28, 2025 నాటి ఎన్‌పీసీఐ (NPCI) సర్క్యులర్ ప్రకారం.. టోల్ ప్లాజాలో ఫాస్ట్ ట్యాగ్ ఎప్పుడు యాక్టివ్ అవుతుందో దానికి సంబంధించి నిర్దిష్ట సమయం ఆధారంగా ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీలు ఇప్పుడు ధృవీకరించడం జరుగుతుంది.

Read Also : 8th Pay Commission : బిగ్ అప్‌డేట్.. జీతాల జాబితాలో కీలక మార్పులు.. ఉద్యోగులు, పెన్షర్లకు ఎంత పెరగనుందంటే?

కొత్త ఫాస్టాగ్ నిబంధనల ప్రకారం.. తక్కువ బ్యాలెన్స్, పేమెంట్ ఆలస్యం లేదా ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయినా భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లోని సమస్యల కారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల లాంగ్ క్యూలను తగ్గించడమే దీనిఉద్దేశ్యం.

ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. వాహనం టోల్ దాటడానికి ముందు 60 నిమిషాల కన్నా ఎక్కువసేపు లేదా టోల్ దాటిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్ యాక్టివ్‌గా ఉంటే.. ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి చెల్లింపులు 176 ఎర్రర్ కోడ్‌తో రిజెక్ట్ అవుతాయని గమనించాలి.

ముందుగా మీ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయండి :
వాహనం టోల్ రీడర్ గుండా వెళ్ళిన 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయం తర్వాత టోల్ లావాదేవీ జరిగితే వినియోగదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు అవుతాయి. అంతకుముందు, వినియోగదారులు టోల్ బూత్‌లోనే ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ముందుకు సాగవచ్చు. కానీ, ఇప్పుడు ఫాస్టాగ్‌ను ముందుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫాస్ట్ ట్యాగ్ ధ్రువీకరణలో కీలక మార్పులు :
జనవరి 28 నాటి ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం.. ఇప్పుడు నిర్దేశించిన కాలపరిమితిలోపు ఫాస్టాగ్ లావాదేవీలను పూర్తి చేయడం తప్పనిసరి. రెండు ముఖ్యమైన షరతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టోల్ స్కాన్‌కు గంట ముందు : మీ ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటే.. హాట్ లిస్ట్‌లో ఉంటే లేదా గంటకు పైగా తక్కువ బ్యాలెన్స్ స్టేటస్‌లో ఉంటే లావాదేవీ విఫలం అవుతుంది.
టోల్ స్కాన్ తర్వాత 10 నిమిషాలు : స్కాన్ చేసిన తర్వాత ఫాస్టాగ్ 10 నిమిషాలు ఇన్‌యాక్టివ్ ఉంటే లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే లావాదేవీ మళ్లీ రిజెక్ట్ అవుతుంది.

ఈ రెండు షరతుల ప్రకారం.. సిస్టమ్ 176 ఎర్రర్ కోడ్‌తో లావాదేవీని తిరస్కరిస్తుంది. వినియోగదారుడు టోల్ రుసుమును రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.

ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులపై ప్రభావం :
ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను రెండు కేటగిరీలుగా విభజించారు. వైట్‌లిస్ట్ (యాక్టివ్), బ్లాక్‌లిస్ట్ (ఇన్యాక్టివ్). ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ చేయడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.

* తగినంత బ్యాలెన్స్ లేకపోవడం
* కేవైసీ ధృవీకరణ పెండింగ్‌లో ఉండటం
* వాహన రిజిస్ట్రేషన్‌లో లోపాలు

కొత్త నిబంధనల ప్రకారం.. మీరు టోల్ బూత్ చేరుకోవడానికి 60 నిమిషాల ముందు మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయితే చివరి నిమిషంలో రీఛార్జ్ చేయడం ద్వారా మీరు జరిమానాను నివారించలేరు. అయితే, టోల్ స్కాన్ చేసిన 10 నిమిషాల్లోపు రీఛార్జ్ జరిగితే సాధారణ టోల్ రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆపై రెట్టింపు జరిమానాను నివారించవచ్చు.

కొత్త నిబంధనల మార్పు ప్రభావం :
ఈ మార్పుతో టోల్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుందని, టోల్ ప్లాజాల వద్ద వివాదాలను తగ్గిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. “ఈ వ్యవస్థ లావాదేవీ వైఫల్యాలను తగ్గిస్తుంది. టోల్ అనుభవాన్ని పెంచుతుంది. వినియోగదారులు వారి అకౌంట్ నిర్వహణపై శ్రద్ధ వహించేలా ప్రోత్సహిస్తుంది” అని న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

ఇది కాకుండా, టోల్ వసూలును మరింత పారదర్శకంగా, సజావుగా చేయడమే ఈ కొత్త సిస్టమ్ ముఖ్య లక్ష్యం. తద్వారా టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్‌ను నివారించవచ్చు. ప్రయాణం సజావుగా సాగుతుంది. ఈ మార్పుల గురించి తెలియని వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల, అన్ని వాహన యజమానులు తమ ఫాస్టాగ్‌ను సరిగ్గా నిర్వహించడం ముఖ్యం.

Read Also : Post Office Savings Scheme : మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు.. కేవలం ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు!

పెనాల్టీ పడకుండా వాహనదారులు ఏమి చేయాలి? :

జరిమానాలను నివారించడమే కాకుండా సజావుగా టోల్ లావాదేవీలు జరిగేలా చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

  • సుదీర్ఘ ప్రయాణానికి ముందు మీ అకౌంట్లలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోండి.
  • బ్లాక్ లిస్ట్ కాకుండా కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.
  • టోల్ ప్లాజాకు చేరుకునే ముందు మీ ఫాస్ట్ ట్యాగ్ స్టేటస్ చెక్ చేయండి.
  • వినియోగదారులు తమ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.
  • తమ FASTag యాక్టివ్‌గా ఉంచుకుంటే కొత్త రూల్స్ సులభంగా పాటించవచ్చు.
  • ఏవైనా జాప్యాలు లేదా అనవసరమైన జరిమానాలను నివారించవచ్చు.