8th Pay Commission : బిగ్ అప్‌డేట్.. జీతాల జాబితాలో కీలక మార్పులు.. ఉద్యోగులు, పెన్షర్లకు ఎంత పెరగనుందంటే?
8th Pay Commission : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ జనవరి 16, 2025న 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించారు. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరుగునుందంటే?

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కొత్త 8వ వేతన సంఘం ప్రక్రియ ప్రారంభం కానుంది. 8వ పే కమిషన్ ఏర్పాటుపై విధి విధానాలు, మార్గదర్శకాలు, ఉద్యోగుల డిమాండ్లపై పెద్ద చర్చ కొనసాగింది.
పెన్షన్ విధానంపై కూడా కీలకంగా చర్చించారు. పాత పెన్షన్ విధానం మళ్లీ తీసుకురావాలనే ప్రతిపాదన ఉద్యోగుల నుంచి కనిపిస్తోంది. అంతేకాదు.. కొత్త పెన్షన్ వ్యవస్థను తొలగించాలని కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్‌లో కొత్తగా అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ (UPS) కూడా వద్దని అంటున్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత జనవరి 16న 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త వేతన సంఘం కారణంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు భారీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
8వ వేతన సంఘం కింద పెన్షన్లు జీతాలకు అనుగుణంగా పెరిగే అవకాశం ఉంది. సగటున 25 శాతం నుంచి 30శాతం పెంపు ఉంటుందని భావిస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారికి సీనియర్ పెన్షనర్లకు అదనపు భత్యాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అధిక డియర్‌నెస్ రిలీఫ్ (DR) కూడా ఉండవచ్చు. 8వ వేతన సంఘంతో పాటు జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS), పాత పెన్షన్ పథకం (OPS), యూనిఫాం పెన్షన్ పథకం (UPS) వంటి పెన్షన్లలో కూడా భారీగా సంస్కరణలు జరిగే అవకాశం ఉంది.
ఉద్యోగులు, సంఘాలు నిరంతరం ఓపీఎస్‌కి తిరిగి రావాలని లేదా ఎన్ పీఎస్‌లోనే మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్టోబర్ 16, 2024న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపును ఆమోదించింది.
8వ వేతన సంఘం ప్రకారం.. ప్రాథమిక వేతనం/పెన్షన్‌లో ప్రస్తుతమున్న 50శాతం రేటు కన్నా 3 శాతం పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే.. దాదాపు 49.18 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 64.89 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది.
ఈ వేతన సంఘం సిఫార్సులను వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచి అమలు చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ కారకాన్ని 2.57 నుంచి 2.86కి పెంచాలని కూడా ప్రతిపాదించింది.
దాంతో కనీస వేతనం రూ. 18వేల నుంచి రూ. 51,480కి పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. పెన్షనర్ల పెన్షన్‌లో కూడా భారీగా పెరుగుదల ఉండే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణ అనేది ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ ఆధారంగా ఉంటుంది. ఇందులో బేసిక్ పే మొత్తాన్ని సవరిస్తారు. గత 7వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది.
అన్ని గ్రేడ్ల వారికి భారీగా వేతనం పెరిగే అవకాశం :
6వ వేతన సంఘం ప్రకారం.. లెవల్ 1లో వేతనాలు రూ.7వేలు ఉంటే.. 7వ వేతన సంఘం రూ. 18వేలకు పెంచారు. 8వ వేతన సంఘం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా నిర్ణయిస్తే మాత్రం లెవల్ 1 నుంచి లెవల్ 10 అన్ని గ్రేడ్ల వారికి భారీగా వేతనం పెరిగే అవకాశం ఉంది.
అయితే, కొన్ని నివేదికలు కనీస వేతనంలో 186శాతం వరకు పెరుగుదలను అంచనా వేయగా అది కాస్తా రూ. 34,560కి చేరింది. గరిష్ట పెన్షన్ పరంగా చూస్తే.. ప్రస్తుతం నెలకు రూ.1.25 లక్షలను పొందే పెన్షనర్లకు తమ పెన్షన్‌ను రూ.2.40 లక్షలకు పెరగవచ్చు. 8వ వేతన సంఘం సిఫార్సులు పెన్షనర్ల పెన్షన్‌లో భారీగా పెరుగుదలను తీసుకువస్తాయని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత అంచనాల ప్రకారం.. నెలకు రూ. 3.5 లక్షల పెన్షన్ సాధించడం సాధ్యం కాదనే చెప్పాలి.
8వ వేతన సంఘం ప్రకారం పరిశీలిస్తే..
ఫిట్‌మెంట్ కారకాన్ని 2.86 వద్ద నిర్ణయించే అవకాశం గురించి ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో భారీగా పెరుగుదల ఉండనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుత కనీస వేతనాన్ని కొత్త వేతనంగా మార్చనుంది. 7వ వేతన సంఘంలో ఈ అంశం 2.57గా ఉంది. దాంతో ఉద్యోగుల కనీస వేతనం రూ.7వేల నుంచి రూ.18వేలకు పెరిగింది.
Read Also : 8th Pay Commission : ఉద్యోగుల జీతాలు పెరిగే డేట్ ఇదేనా? ఎంత పెరగొచ్చు? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ కారకం 2.86 అయితే మాత్రం కనీస వేతనం రూ. 18వేల నుంచి రూ. 51,480కి పెరగవచ్చు. అంటే.. దాదాపు 186శాతం పెరుగుదల ఉండనుంది. ఫలితంగా పెన్షనర్ల పెన్షన్‌లో భారీగా పెరుగుదల ఉండనుంది. ఉదాహరణకు, ప్రస్తుత కనీస పెన్షన్ రూ.9వేలు ఉండగా ఏకంగా రూ.25,740 వరకు పెరగవచ్చు.
ప్రస్తుతానికి ఈ గణాంకాలు ప్రతిపాదించినవి మాత్రమే. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన తర్వాతే తుది నిర్ణయంపై స్పష్టత రానుంది. 8వ వేతన సంఘం 2.86 ఫిట్‌మెంట్ కారకం ఆధారంగా పెన్షనర్ల కనీస పెన్షన్ ప్రస్తుత రూ. 9వేలు నుంచి నెలకు రూ.25,740కి పెరగవచ్చు. అదేవిధంగా, గరిష్ట పెన్షన్ రూ. 1,25,000 నుంచి పెరిగే అవకాశం ఉంది.