గుడ్ న్యూస్ : డబుల్ కానున్న కనీస వేతనం

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుడ్ న్యూస్. వారి కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉంది.

  • Published By: veegamteam ,Published On : March 7, 2019 / 04:19 AM IST
గుడ్ న్యూస్ : డబుల్ కానున్న కనీస వేతనం

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుడ్ న్యూస్. వారి కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉంది.

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుడ్ న్యూస్. వారి కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉంది. ఇది గరిష్ఠంగా రూ.447 వరకు పెరగనుంది. జాతీయస్థాయిలో కనీస వేతనాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. రాష్ట్రాలను 5 కేటగిరీలుగా విభజిస్తూ ఆ మేరకు కనీస వేతనాలను కమిటీ ప్రతిపాదించింది. తెలుగు రాష్ట్రాలను ఒకే కేటగిరీ కిందకు తీసుకొస్తూ నెలవారీ కనీస వేతనాన్ని రూ.9,880గా నిర్ణయించారు. 2018 జులై నాటికి ధరల ప్రామాణికంగా ఒక్కో వ్యక్తికి అయ్యే ఖర్చును లెక్కించి నివేదిక సిద్ధం చేసిన కమిటీ.. దాన్ని కేంద్ర కార్మికశాఖకు అందించింది.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

గతంలో 3 రీజియన్లగా కనీస వేతనాలు విభజించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను ఐదుకి పెంచారు. ఇందులో తెలుగు రాష్ట్రాలు రీజియన్‌-2లో ఉన్నాయి. ఈ ప్రాంత కార్మికులకు కనీస వేతనం తక్కువగా ఉంటోంది. ఢిల్లీ, గోవా, హరియాణా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ను కేటగిరీ-4లో చేర్చారు. కనీస వేతనానికి అదనంగా రోజుకి రూ.55 చొప్పున ఇంటి అద్దెను చేర్చారు. ఈ లెక్కన ప్రాంతాల వారీగా ధరలు ఉండనున్నాయి.

రీజియన్‌-2: కనీసవేతనం: రోజుకి రూ.380, నెలకు రూ.9,880 ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ రోజు వారీ అవసరాల ప్రాతిపదికగా జాతీయ కనీస వేతనం 2018 జులై నాటికి రోజుకు రు.375 లేదా నెలకు రు.9,750 ఉండాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. రంగాలు, నైపుణ్యాలు, వృత్తులు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో నిమిత్తం లేకుండా, 3.6 యూనిట్‌లు కలిగిన కుటుంబానికి ఇది అమలు కావాలని కమిటీ సిఫార్సు చేసినట్లు అధికార ప్రకటన చేసింది. 
Also Read: పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

జాతీయ కనీస వేతనం (NMW) నిర్ధారించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను సమీక్షించి, సిఫార్సు చేసేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2017 జనవరి 17న అనూప్‌ శత్పతి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి అందచేసింది. అదనపు ఇంటి అద్దె అలవెన్సు (సిసిఎ)ను కూడా ప్రవేశపెట్టాలని, అది పట్టణ ప్రాంత కార్మికులకు రోజుకు సగటున రు.55 వరకు, నెలకు రు.1430గా వుండాలని సిఫార్సు చేసింది.
Also Read: తమిళ మంత్రి సంచలన వ్యాఖ్యలు : అమ్మను.. హల్వా పెట్టి చంపేశారు