Traffic Rules
Traffic Rules : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతోపాటు రోడ్డు భద్రతను మెరుగుపర్చడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇండియన్ మోటార్ వెహికల్ రూల్స్ ను సవరించింది. ఇందుకు సంబంధించిన బుధవారం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
కేంద్రం కొత్త రూల్స్ ప్రకారం..
♦ వాహనదారుడు ఒక ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ కానుంది.
♦ డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేసే ముందు అథారిటీ ముందు వాదన వినిపించుకునే చాన్స్ ఉంటుంది. ఆ తరువాత లైసెన్స్‌ను ఎంతకాలం సస్పెడ్ చేయాలో అథారిటీ నిర్ణయిస్తుంది.
♦ జనవరి 1వ తేదీ నుంచే ఈ రూల్ అమల్లోకి వచ్చింది.
♦ ఓవర్ స్పీడ్, హెల్మెంట్, సీటు బెల్టు లేకుండా వాహనం నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, బహిరంగ ప్రదేశాల్లో అక్రమ పార్కింగ్, ఓవర్ లోడింగ్, వాహనాన్ని దొంగిలించడం, తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం వంటి 24 ట్రాఫిక్ నేరాలను ప్రభుత్వం నోటిఫై చేసింది.
♦ కేంద్రం నోటిఫై చేసిన అంశాల్లో ఐదు సార్లు ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్స్ సస్పెండ్ చేయనుంది.
♦ లైసెన్స్‌ను సస్పెండ్ చేసే అధికారం ఆర్టీవో, డీటీవోలకు ఉంటుంది. ఎంతకాలం సస్పెండ్ చేయాలో ఆ సంస్థలే నిర్ణయిస్తాయి.
♦ గతంలో వరుసగా చలాన్లు పడిన వాహనదారుడికి లైసెన్సును మూడు నెలలు నుంచి ఏడాది వరకు సస్పెండ్ చేసేవారు. ఇకపై ఈ-చలాన్లను కూడా పరిగణలోకి తీసుకుంటారు.