Responsible Nations Index : ఎప్పుడూ విదేశాల సంస్థలే రేటింగ్స్ ఇవ్వాలా? ఇక నుంచి ఇండియానే రేటింగ్స్ ఇచ్చే కొత్త ఇండెక్స్..
Responsible Nations Index : ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అందులో ఎన్ని దేశాలు బాధ్యతాయుతంగా ఉన్నాయి? ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాయి? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, టార్గెట్ రీచ్ అయ్యారా? లేదా అనే అంశాలు, ఇలా అనేక అంశాలపై ఈ జాబితాను రెడీ చేస్తుంది భారత్.
Responsible Nations Index
- స్వయంగా ఓ ఇండెక్స్‌ను డెవలప్ చేసిన ఇండియా.
- ‘రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్’ను ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- 154 దేశాలను అంచనా వేయనున్న ఇండెక్స్
- బాధ్యతాయుత దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో సింగపూర్.. 16వ స్థానంలో భారత్
Responsible Nations Index : ‘ఇండియా ఈ సంవత్సరం ఇంత గ్రోత్ రావొచ్చు. ద్రవ్యోల్బణం శాతం ఇంత పెరగొచ్చు. ఉద్యోగాల కల్పన ఈ రేంజ్‌లో ఉండొచ్చు. జీతాల పెరుగుదల తగ్గొచ్చు.’ ఈ టైప్‌లో ఎప్పుడూ విదేశాలకు చెందిన కంపెనీలే ఇండియాకి, ఇతర దేశాలకు రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. అందులో కొన్ని ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. కానీ, ఇండియా నుంచి ఎప్పుడూ ఇతర దేశాలకు రేటింగ్ ఇచ్చే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఇఫ్పుడు ఆ చాన్స్ వచ్చింది. ఇండియా స్వయంగా ఓ ఇండెక్స్ ని డెవలప్ చేసింది. అదే ‘రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్.’ అంటే బాధ్యతాయుత దేశాల జాబితా.
Also Read : Sea Buckthorn: ప్రధాని మోదీ ఫేవరట్ ప్రూట్ ఇదే.. దీని అద్భుత ప్రయోజనాలు ఏంటి, యువత ఎందుకు తినాలి..
ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. అందులో ఎన్ని దేశాలు బాధ్యతాయుతంగా ఉన్నాయి? ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాయి? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, టార్గెట్ రీచ్ అయ్యారా? లేదా అనే అంశాలు, ఇలా అనేక అంశాలపై ఈ జాబితాను రెడీ చేస్తుంది భారత్. ఈ ఇండెక్స్‌లో సుమారు 154 దేశాలు ఉన్నాయి. తాజాగా దీన్ని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్టార్ట్ చేశారు. సింగపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈ జాబితాను రిలీజ్ చేశారు. ఆ జాబితాలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
బాధ్యతాయుత దేశాల జాబితాలో సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్, డెన్మార్క్, సిప్రస్ ఉన్నాయి. ఈ లిస్టులో ఇండియా 16వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ప్లేస్ లో ఫ్రాన్స్ ఉన్నాయి. జపాన్ 38వ స్థానంలో ఉంది. అమెరికా 66వ ప్లేస్ లో ఉంది. ముఖ్యమైన అంశం ఏంటంటే లిబియా అంతకంటే బెటర్ గా 65వ స్థానంలో ఉంది. ఇక దాయాది దేశం పాకిస్తాన్ అయితే 90వ ప్లేస్ లో ఉంటే, మరో పొరుగు దేశం అప్ఘానిస్తాన్ 145 ప్లేస్ లో నిలిచింది. ఏ దేశం దగ్గర ఎంత డబ్బుంది అనే దాని కంటే కూడా ఆ దేశం, ఆయా ప్రభుత్వాలు ప్రజల పట్ల ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాయనే అంశాలను ఈ జాబితా ప్రముఖంగా చూపుతోంది.
బాధ్యతాయుత దేశాల జాబితా అనే ఐడియాని తీసుకొచ్చింది భారత్. ఇండియా ఐడియాని వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్, ఐఐఎం – ముంబై, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అంబేద్కర్ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటివి కలిసి సంయుక్తంగా స్టడీ చేశాయి. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్, అగ్రి కల్చరల్ సంస్థలకు సంబంధించిన డేటాను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించారు. 2023 ఏడాది వరకు ఈ డేటాను విశ్లేషించారు.
ఇప్పటి వరకు వచ్చే జాబితాలు అన్నీ కూడా ఫలానా దేశం ఇంత ఆర్థిక పరిస్థితి కలిగి ఉంది. ఫలానా కంట్రీకి ఇంత మిలటరీ పవర్ ఉంది. ఫలానా దేశం ఇంత హ్యాపీగా ఉంది. ఫలానా దేశం ఇంత కాలుష్యంతో ఉంది.. అంటూ రకరకాల జాబితాలు వచ్చాయి. మొదటిసారి అసలు ఏ దేశం ఎంత బాధ్యతాయుతంగా ఉంది అనే ఇండెక్స్ తీసుకురావడం, దానికి ఇండియన్ సంస్థలు సారధ్యం వహించడంతో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది.
