Nia Raids In Tamilnadu Puducherry
NiA conducts raids in tamilnadu : జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో దాడులో నిర్వహిస్తోంది. చెన్నైలోని వివిధ ప్రాంతాలతోపాటు మైలదెతురాయ్, కరైకల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ తరఫున ప్రచారం నిర్వహించడం..ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో చెన్నైలోని మైలదెతురాయ్, కరైకల్‌లోని పలు ప్రాంతాల్లో NiA ఒకేసారి దాడులు నిర్వహిస్తోంది.
ఉగ్రనిధులకు సంబంధించి ఇప్పటికే నమోదు అయిన కేసు దర్యాప్తుకు వచ్చిన సమాచారంతో NiA అధికారులు ఆయా ప్రాంతాల్లోని పలువురి నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చెన్నైతో పాటు పుదుచ్చేరిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.