NIA Raids: గ్యాంగ్‭స్టర్లపై ఉక్కుపాదం.. దేశంలోని 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

సిద్ధూ మూసేవాలా మరణం అనంతరం ఈ ఘటనపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని, లారెన్స్ బిష్ణోయిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా గ్రూపు ప్రకటించింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీరితో పాటు ఇతర గ్యాంగ్‭స్టర్ల కార్యకలాపాలపై సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా జైలు నుంచి కార్యకాలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‭స్టర్లపై కూడా ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం.

NIA Raids: గ్యాంగ్‭స్టర్లపై ఉక్కుపాదం.. దేశంలోని 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు

NIA Raids being conducted at 60 locations across India over crackdown on gangsters

Updated On : September 12, 2022 / 10:48 AM IST

NIA Raids: గ్యాంగ్‭స్టర్లు, క్రైం సిండికేట్లను అణచివేయడమే లక్ష్యంగా దేశంలో ఒకేసారి 60 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సోమవారం ఉదయం సోదాలు నిర్వహించింది. లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్, బంబిహా గ్యాంగ్, నీరజ్ బవానా గ్యాంగ్‭లకు సంబంధించిన 10 మంది గ్యాంగ్‭స్టర్లపై ఆదివారం ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. ఆ మార్నడే ఎన్ఐఏ సోదాలు చేపట్టింది.

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులోని గ్యాంగ్‭స్టర్లకు టెర్రర్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని, వీరిని ఐఎస్ఐ సైతం వినియోగించుకోంటోందని పంజాబ్ డీజీపీ ఆదివారం పేర్కొన్నారు. ఎన్ఐఏ తెలిపివన వివరాల ప్రకారం నీరజ్ బవానాతో పాటు అతడి గ్యాంగ్.. ప్రముఖుల హత్యల్లో పాల్గొనడం, సోషల్ మీడియాలో భయబ్రాంతులు వ్యాప్తి చేయడం లాంటివి చేస్తున్నారట. లారెన్స్ బిష్ణోయి గ్రూపుతో నీరజ్ బవానా గ్రూపుకు మధ్య ప్రస్తుతం వార్ కొనసాగుతోందట.

సిద్ధూ మూసేవాలా మరణం అనంతరం ఈ ఘటనపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని, లారెన్స్ బిష్ణోయిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా గ్రూపు ప్రకటించింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీరితో పాటు ఇతర గ్యాంగ్‭స్టర్ల కార్యకలాపాలపై ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా జైలు నుంచి కార్యకాలాపాలు సాగిస్తున్న గ్యాంగ్‭స్టర్లపై కూడా ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. ఇక పాకిస్తాన్, కెనడా, దుబాయ్‭ల నుంచి జరుగుతున్న కార్యకలాపాలపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది.

Tejashwi Yadav: కాంగ్రెసే పెద్ద ప్రతిపక్షమన్న తేజశ్వీ.. మరి ప్రధాని అభ్యర్థిగా మద్దతు ఎవరికి?