Giriraj Singh: నితీశ్ కుమార్ వారం రోజులు సెలవులు తీసుకుని ధ్యానం చేయాలి: కేంద్ర మంత్రి
గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కల్తీ మద్యం తాగి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యుడు ముఖ్యమంత్రి కాదా? సరైన చట్టం తీసుకురాకపోవడంతో ఎవరూ భయపడడం లేదు’’ అని అన్నారు. విమర్శలను కూడా నితీశ్ కుమార్ స్వీకరించాలని, బిహార్ అసెంబ్లీలో అనవసరంగా అరవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. నితీశ్ కుమార్ వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి ధ్యానం చేయాలని ఆయన అన్నారు.

Nitish is not even CM material then how can he become PM material slams by Giriraj Singh
Giriraj Singh: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ వారం రోజుల పాటు సెలవు తీసుకుని, ధ్యానం చేయాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. మద్య నిషేధం అమలులో ఉన్న బిహార్ లోని ఛప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘మద్యం తాగిన వారు చనిపోతారు’’ అంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు.
దీనిపై గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ… ‘‘కల్తీ మద్యం తాగి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యుడు ముఖ్యమంత్రి కాదా? సరైన చట్టం తీసుకురాకపోవడంతో ఎవరూ భయపడడం లేదు’’ అని అన్నారు. విమర్శలను కూడా నితీశ్ కుమార్ స్వీకరించాలని, బిహార్ అసెంబ్లీలో అనవసరంగా అరవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.
నితీశ్ కుమార్ వారం రోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి ధ్యానం చేయాలని ఆయన అన్నారు. మద్య నిషేధం పట్ల తాను సానుకూలంగానే ఉన్నానని, కానీ, నితీశ్ కుమార్ మొండి వ్యక్తి అని చెప్పారు. మద్య నిషేధాన్ని ఎలా అమలు చేయాలన్న విషయంపై ఓ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మద్య పాన నిషేధం సరైన రీతిలో అమలు కాకపోవడం వల్ల ప్రజలు చనిపోతున్నారని, అంతేగాక చాలా మంది నేరస్థులుగా మారుతున్నారని చెప్పారు.