New Syllabus : నీట్ – యూజీ సిలబస్ కుదింపు.. కొత్త సిలబస్ విడుదల చేసిన ఎన్ఎంసీ

ఎన్ఎంసీ విడుదల చేసిన సిలబస్ ప్రకారం భౌతికశాస్త్రంలో అధికంగా సిలబస్ కుదించబడింది. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. బొటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్ పై పెద్ద ప్రభావం చూపబోదని నీట్ ట్రెయినర్ శంకర్ రావు తెలిపారు.

New Syllabus : నీట్ – యూజీ సిలబస్ కుదింపు.. కొత్త సిలబస్ విడుదల చేసిన ఎన్ఎంసీ

NEET UC New Syllabus

Updated On : October 8, 2023 / 10:45 AM IST

NEET UG New Syllabus : ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వమించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్ ను కుదించారు. విద్యార్థులపై భారం తగ్గించడంలో భాగంగా నీట్-2024 నూతన సిలబస్ ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సిలబస్ లో స్వల్ప మార్పులు చేసింది. ఈ ఏడాది నీట్ ను 2024మే 5న నిర్వహించనున్నారు.

నీట్ రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఎన్ఎంసీ విడుదల చేసిన సిలబస్ ప్రకారం భౌతికశాస్త్రంలో అధికంగా సిలబస్ కుదించబడింది. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. బొటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్ పై పెద్ద ప్రభావం చూపబోదని నీట్ ట్రెయినర్ శంకర్ రావు తెలిపారు.

CBI Raids : సివిక్ బాడీ రిక్రూట్‌మెంట్ స్కాంలో కోల్‌కతా మేయరు ఇంటిపై సీబీఐ దాడులు

కెమిస్ట్రీ, ఫిజిక్స్ లలో భారీగా సిలబస్ ను తగ్గించారని వెల్లడించారు. ఇది విద్యార్థులకు అనుకూలించే అంశమని పేర్కొన్నారు. సిలబస్ ను ఆలస్యంగా విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిలబస్ తగ్గింపుతో ప్రస్తుత సెకండియర్ విద్యార్థుల కన్నా, ఫస్టియర్ విద్యార్థులకే అధిక లాభమన్నారు.

తొలగించిన పాఠ్యాంశాలు..
రసాయన శాస్త్రం ఫస్టియర్ లో పదార్థం స్థితి, హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్ మెంటల్ కెమిస్ట్రీ. రసాయనశాస్త్రం సెకండియర్ లో ఘన స్థితి, ఉపరితల రసాయనశాస్త్రం, మెటలర్జీ, రోజువారీ జీవితంలో పాలిమర్లు, కెమిస్ట్రీ. భౌతికశాస్త్రం ఫస్టియర్ లో ప్యూర్ రోలింగ్, కనెక్టింగ్ బాడీలు, పాలిట్రోపిక్ ప్రక్రియ, బలవంతమైన, దెబ్బతిన్న డోలనాలు.

Telangana Govt : దసరా సెలవులో మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

భౌతికశాస్త్రం సెకండియర్ లో పొటెన్షియల్, నాన్ పొటెన్షియల్ సంభావ్యత, ప్రొటెన్షియో మీటర్, ఎర్త్ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిప్లయర్లు. జువాలజీలో యూనిట్-2: వానపాములు, యూనిట్-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, నేంద్రియాలు (చెవులు, కండ్లు), యూనిట్-10 లో జీవావరణం, పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్థకం.

బోటనీ ఫస్టియర్ సిలబస్ లో ప్లాంట్ ఫిజియోలజీలో ట్రాన్స్ పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, మార్పొలజీ. బోటనీ సెకండియర్ సిలబస్ లో స్ట్రాటజీస్ ఫర్ ఎన్ హ్యాన్స్ మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. బోటనీలో కొత్తగా బయో మాలిక్యూల్స్, ఎంజైములు, ప్రాపర్టీలు, మాల్వేస్, లెగుమనీస్ సహా మరికొన్ని అంశాలను చేర్చారు.