Karnataka : హిజాబ్‌పై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కొత్త డ్రెస్ కోడ్‌ను విడుదల చేసిన తర్వాత ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్ వివరణ ఇచ్చారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కొత్త డ్రెస్ కోడ్ అన్ని రకాల హెడ్ కవర్లను నిషేధించిన కొన్ని గంటల తర్వాత బోర్డులు, కార్పొరేషన్ల నియామక పరీక్షల సమయంలో హిజాబ్‌లపై నిషేధం లేదని మంత్రి సుధాకర్ చెప్పారు.
బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి పరీక్షల్లో కాపీ చేస్తున్నారనే ఫిర్యాదుపై కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కొత్త డ్రెస్ కోడ్ ప్రకటించింది. ఈ డ్రెస్ కోడ్ పై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. డ్రస్ కోడ్ వెనుక ఉన్న ఆలోచన దుష్ప్రవర్తనను తనిఖీ చేయడమేనని, ఏదైనా సందర్భంలో హిజాబ్‌లు నోటిని కప్పివేయవని, కాబట్టి బ్లూటూత్ పరికరాలను ఉపయోగించడం సాధ్యం కాదన్నారు.
ALSO READ : IMD Issues Warning : బంగాళాఖాతంలో అల్పపీడనం…ఆంధ్రా మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరిక
కొత్త నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఉన్నత విద్యా మంత్రి సుధాకర్ తెలిపారు. హిజాబ్‌లు ధరించిన మహిళా అభ్యర్థులు ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చి సరైన పరిశీలన జరిపిన తర్వాతే పరీక్షాకేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. తాము పరీక్షా కేంద్రాల వద్ద మరిన్ని మెటల్ డిటెక్టర్‌లను ప్రవేశపెడతామని మంత్రి ప్రకటించారు.
ALSO READ : Gold Rate Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్ .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే?
‘‘పరీక్షల్లో ఈ రూల్స్ కొత్తేమీ కాదు, అవి ఇంతకు ముందు కూడా ఉన్నాయి. మేం కేవలం అప్రమత్తతను పెంచాలనుకుంటున్నాం. అనవసరమైన టోపీలు లేదా కండువాలు ధరించడం అనుమతించం, కానీ అది హిజాబ్‌కు వర్తించదు’’ అని మంత్రి సుధాకర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ALSO READ : Earthquake : లద్దాఖ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్ర 4.4 గా నమోదు
‘‘తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీని ధరించి వస్తే తాము పరీక్ష హాల్‌లోకి అనుమతించమని అధికారులు పేర్కొన్నారు. బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ చేయకుండా అరికట్టడానికి చేసే ప్రయత్నంలో ఇది భాగమని తాజా ఆర్డర్ పేర్కొంది.