Omicron Variant
Omicron Variant : నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఈ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు వ్యాపించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్ఓ సైతం హెచ్చరించింది.
కాగా, మన దేశంలో ఇప్పటిదాకా ఒక్క ‘ఒమిక్రాన్’ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఈ కరోనా కొత్త వేరియంట్ 14 దేశాలకు వ్యాపించిందని చెప్పిన ఆయన.. ప్రస్తుతానికైతే మన దేశంలో లేదని తెలిపారు. అది రాకుండా నివారించేందుకు, వచ్చినా కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వివరించారు.
వేరియంట్ కు సంబంధించిన జన్యు పరిక్రమాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని, అయితే అది మాత్రం ఇంకా పోలేదని తెలిపారు. ఇప్పటిదాకా 124 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వేశామన్నారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ చాలా డేంజర్ అని, ప్రపంచానికి పెను ముప్పు తప్పదని, మరిన్ని వేవ్ లు ఎదుర్కోవాల్సి వస్తుందని డబ్ల్యూహెచ్ఓ చేసిన హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో… ఈ ఒమిక్రాన్ భయబ్రాంతులకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ ను తొలుత గుర్తించగా, ఆ తర్వాత పలు ఆఫ్రికా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయల్, హాంకాంగ్, బోట్స్ వానా, బెల్జియం తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ ను గుర్తించారు.
Paytm Transit Card : పేటీఎం ఆల్ ఇన్-వన్ కార్డు.. అన్ని ట్రాన్సాక్షన్లకు ఒకే కార్డు!
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన దేశాల విమానాల రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి. భారత్ కూడా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్ వైరస్ బారిన పడినవారిలో తొలుత అలసటగా ఉంటుంది. ఒంటి నొప్పులు, గొంతులో కొద్దిగా గరగరగా ఉండటం, పొడి దగ్గు, కొద్ది పాటి జ్వరం కూడా ఉంటుంది. చాలా మటుకు చికెన్ గున్యా లక్షణాలే ఉంటాయి. కరోనా తొలి వేవ్ లో వైరస్ బారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినా చాలా మందికి తెలియకుండానే పోతుంది.