ఓ కాలు లేదు..అయినా..పొలం పనిచేస్తున్నాడు..వీడియో వైరల్

  • Published By: madhu ,Published On : September 18, 2020 / 08:28 AM IST
ఓ కాలు లేదు..అయినా..పొలం పనిచేస్తున్నాడు..వీడియో వైరల్

Updated On : September 18, 2020 / 10:56 AM IST

మనిషికి చేతులు, కాళ్లు..ఇలా అన్ని ఉన్నా..ఇతరులపై ఆధార పడుతుంటుంటారు. తన కాళ్ల మీద నిలబడాలని కొంతమంది అనుకోరు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయరు. కానీ..ఓ రైతు చేస్తున్న ఓ పని అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతరులకు స్పూర్తిని కలిగిస్తున్నాడు. ఇతనికి ఓ కాలు లేదు.



అయినా..సరే..పొలం పనులు చేస్తున్నాడు. సుధా రామెన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ లో దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. లక్షలాది మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్షణాల్లో వైరల్ గా మారింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని, ఎంతో మందికి స్పూర్తి కలిగిస్తున్నాడు అంటూ కొనియాడుతున్నారు.
https://10tv.in/slovenia-woman-jailed-for-allegedly-cutting-off-her-hand-for-insurance-payout/
ప్రపంచంలో చాలా మంది పని చేయకుండా ఉండేందుకు ఎదో వంక వెతుక్కుంటుంటారు. కానీ..ఇక్కడ ఓ హీరో ఉన్నాడు..అంటూ కితాబిస్తున్నారు. అతడి నుంచి ఎంతో నేర్చుకోవచ్చంటున్నారు.



అయితే..వీడియోలో ఉన్న వ్యక్తి ఎక్కడి వారు ? ఇతను ఎవరు ? తదితర వివరాలు వెల్లడించలేదు. మొత్తానికి సదరు రైతు కష్టాన్ని నెటజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.