No Phones In Classroom : ‘క్లాస్‌ రూమ్స్‌లో ఫోన్లు వాడితే కఠిన చర్యలు’ టీచర్లకు జిల్లా మేజిస్ట‍్రేట్‌ వార్నింగ్

క్లాస్‌ రూమ్స్‌లో ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ టీచర్లకు జిల్లా మేజిస్ట‍్రేట్‌ వార్నింగ్ ఇచ్చారు.

No mobile phones in classroom Haridwar DM tells teachers : మొబైల్ ఫోన్ చేతిలో ఉందంటేచాలు తాము ఎక్కడున్నామో..చుట్టు పక్కల ఏం జరుగుతుందో..కూడా పట్టించుకోరు చాలామంది. పలు ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు వాడకూడదనే రూల్ ఉంది. అయినా దొంగచాటుగా చూస్తుంటారు. ఇదిలా ఉంటే ఇకనుంచి మొబైల్ ఫోన్ వాడటం అలవాటు ఉన్న టీచర్లకు హరిద్వార్‌ జిల్లా మేజిస్ట‍్రేట్‌ వినయ్‌ శంకర్‌ షాక్ ఇచ్చారు. క్లాస్ రూముల్లో మొబైల్ ఫోన్లు పట్టుకెళ్లటాన్ని నిషేధించారు.

Also read : Best Smartwatches : భారత్‌లో రూ. 15వేల లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే..!

క్లాస్‌ రూమ్‌ల్లోకి సెల్‌ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లా మేజిస్ట‍్రేట్‌ (District Magistrate)వినయ్‌ శంకర్‌ గురువారం (మార్చి 24,2022) ప్రకటించారు.టీచర్ల వద్ద క్లాస్‌ రూమ్స్‌లో ఫోన్లు కలిగి ఉన్నట్టు నిర్ధారణ అయితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిబంధన కేవలం ప్రభుత్వ స్కూళ్లకే కాదు ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ విషయంపై హరిద్వార్‌ జిల్లా మేజిస్ట‍్రేట్‌ వినయ్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘క్లాస్ రూముల్లో మాస్టార్లు మొబైల్ ఫోన్‌లతో బిజీగా ఉండటం చాలా కాలంగా గమినిస్తున్నామని తెలిపారు. ఫోన్లలో బిజీగా గేమ్స్‌ ఆడటం, చాటింగ్‌లు చేస్తూ పిల్లలకు పాఠాలు చెప్పటం కూడా మానేస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధుల నుంచి తమకు చాలా కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

Also read : Paddy Issue : టీఆర్ఎస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.. అన్నీ తప్పుడు ఆరోపణలే – పీయూష్ గోయల్

ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్‌లను స్కూల్ కు తీసుకెళ్లవచ్చు కానీ.. ఫోన్లను ప్రిన్సిపాల్ గదిలో ఉంచి క్లాసులకు వెళ్లాలని స్పష్టం చేశారు. కానీ టీచర్‌ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చని తెలిపారు. కాగా, ప్రిన్సిపాల్‌ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఫోన్‌ తమ వద్ద పెట్టుకోవాలి అని సూచించారు. ఈ విషయంతో ఆకస్మిక తనిఖీలు చేస్తామని అలా తనిఖీల్లో ఎవరైనా పట్టుబడితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్‌ కూడా బాధ్యత వహించాలని ఆ రూల్స్ ను అమలు చేసేలా చూసే బాధ్యత ప్రిన్సిపాల్ దేనని స్పష్టంచేశారు.

 

ట్రెండింగ్ వార్తలు