ఆ సినిమానే స్ఫూర్తి.. ఈ స్కూళ్లల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా బ్యాక్‌ బెంచర్స్‌ ఉండరు.. ఎలా సాధ్యమైందంటే? క్యా ఐడియా మామా..

ఈ సినిమా నుంచి ఈ ఐడియాను తీసుకుని దాన్ని పలు స్కూళ్లు అమలు చేస్తున్నాయి.

బ్యాక్ బెంచ్‌ అనే పదం వినగానే సరిగ్గా చదవని పిల్లలు అందులో కూర్చుంటారన్న భావన మదిలో తడుతుంది. అసలు క్లాస్‌ రూమ్స్‌లో బ్యాక్ బెంచ్‌లే లేకుండా చేస్తే ఎలా ఉంటుంది. ఇది సాధ్యమేనా?

వినేశ్‌ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “స్థానార్థి శ్రీకుట్టన్” అనే మలయాళ సినిమా క్లైమాక్స్‌ సీన్‌ ప్రేరణతో కేరళలో కొన్ని పాఠశాలలు క్లాస్‌ రూమ్స్‌లో బ్యాక్‌ బెంచులు లేకుండా చేశాయి. విద్యార్థులు తరగతి గదుల్లో కొత్త పద్ధతిలో కూర్చుకుంటున్నారు.

Also Read: Alienware 16 Aurora వచ్చేసింది.. ఈ ల్యాప్‌టాప్‌లో ఏముంది స్పెషల్? తెలిస్తే కొనేస్తారంతే..

క్లాస్‌ రూమ్‌లో U-ఆకారంలో బెంచీలు వేసుకుని కూర్చుంటున్నారు. విద్యార్థులు సెమీ సర్కిల్‌గా కూర్చుంటారు. ఈ U ఆకారంలో మధ్య భాగానికి ఎదురుగా టీచర్ నిలబడతారు. ఈ విధంగా ఉపాధ్యాయుడికి ప్రతి విద్యార్థి కనిపిస్తారు. ఈ ఫార్మేషన్‌లో ఏ విద్యార్థికైనా టీచర్ కనపడతారు. అలాగే టీచర్‌ కూడా క్లాస్‌లోని అందరిపైనా శ్రద్ధ పెట్టగలుగుతారు.

“స్థానార్థి శ్రీకుట్టన్” సినిమా 2024, నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. జూన్ 20న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో వచ్చింది. ఈ సినిమాలో నలుగురు విద్యార్థుల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా నుంచి ఈ ఐడియాను తీసుకుని దాన్ని పలు స్కూళ్లు అమలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.