Alienware 16 Aurora వచ్చేసింది.. ఈ ల్యాప్‌టాప్‌లో ఏముంది స్పెషల్? తెలిస్తే కొనేస్తారంతే..

ధర ఎంత? ఎక్కడ దొరుకుతుంది?

Alienware 16 Aurora వచ్చేసింది.. ఈ ల్యాప్‌టాప్‌లో ఏముంది స్పెషల్? తెలిస్తే కొనేస్తారంతే..

Updated On : July 11, 2025 / 6:29 PM IST

గేమర్లకు గుడ్ న్యూస్.. మీలాంటి వారి కోసం ఒక పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ భారత్‌లో లాంచ్ అయింది. డెల్ టెక్నాలజీస్ తమ Alienware 16 Aura లాప్‌టాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇంతకాలం పవర్ కోసం పెద్ద పెద్ద డెస్క్‌టాప్‌లు వాడిన వారు.. ఇప్పుడు ల్యాప్‌టాప్‌నే ఎంచక్కా వాడుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ను అమెజాన్ ప్రైమ్ డే (జూలై 12-14) సందర్భంగా ప్రత్యేకంగా అమ్మకానికి పెట్టనున్నారు.

ఈ ల్యాప్‌టాప్‌లో ఏముంది స్పెషల్?
పవర్, పర్ఫార్మెన్స్: ఇందులో లేటెస్ట్ ఇంటెల్ కోర్ సిరీస్ 2 ప్రాసెసర్లు, కొత్త NVIDIA GeForce RTX 50 సిరీస్ గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే, మార్కెట్లో ఉన్న ఎలాంటి హై-ఎండ్ గేమ్స్ అయినా ఈజీగా ఆడేయొచ్చు.

కూలింగ్ సిస్టమ్ (ఇక వేడెక్కే ఛాన్సే లేదు): గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో పెద్ద సమస్య వేడెక్కడం. కానీ దీనిలో ఉన్న కొత్త “క్రయో-టెక్ కూలింగ్ సిస్టమ్” (Cryo-Tech Cooling) ఎంత సేపు గేమ్స్ ఆడినా లాప్‌టాప్ చల్లగా ఉండేలా చూసుకుంటుంది.

డిజైన్, డిస్‌ప్లే (స్టైల్, క్వాలిటీ రెండూ): చూడటానికి చాలా స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. ఇంత పవర్ ఉన్నా, దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. 16-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లే వల్ల గేమ్స్‌లోని ప్రతి చిన్న డీటెయిల్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ సేపు చూసినా కళ్లకు భారం ఉండదు.

స్టెల్త్ మోడ్ (గేమింగ్ మాత్రమే కాదు, పని కూడా): ఒకే ఒక్క బటన్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను “స్టెల్త్ మోడ్”లోకి మార్చవచ్చు. దీనివల్ల ల్యాప్‌టాప్ శబ్దం చేయదు, లైట్లు ఆగిపోతాయి, పవర్ తక్కువ వాడుకుంటుంది. ఆఫీస్ మీటింగ్‌లలో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది.

అధికారులు ఏమంటున్నారు?
రాజ్ కుమార్ రిషి (డెల్ ఇండియా MD): “డెస్క్‌టాప్ పవర్‌ను, స్లిమ్ డిజైన్‌తో ఒక ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నాం. ఇది గేమింగ్‌లో మా కొత్త ఆవిష్కరణ.”

అతుల్ మెహతా (డెల్ ఇండియా సీనియర్ డైరెక్టర్): “ఈ లాప్‌టాప్ స్టైలిష్ లుక్స్‌తో, గేమర్లతో పాటు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఆలియెన్‌వేర్ జర్నీలో ఒక కొత్త దశ”

ధర ఎంత? ఎక్కడ దొరుకుతుంది?

ప్రారంభ ధర: రూ.1,29,990

ఎక్కడ కొనాలి: జూలై 12 – 14 తేదీల్లో.. కేవలం Amazonలో ప్రైమ్ డే సందర్భంగా లభిస్తుంది.

జూలై 17 తర్వాత: డెల్ అధికారిక వెబ్‌సైట్, డెల్ స్టోర్లు, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్ వంటి అన్ని ప్రముఖ స్టోర్లలో అందుబాటులోకి వస్తుంది.